Paris Olympics 2024 Day 5 : పారిస్ ఒలింపిక్స్‌లో 5వ‌ రోజు భారత షెడ్యూల్.. బ‌రిలో తెలుగు తేజాలు పీవీ సింధు, ఆకుల శ్రీజ‌

ఐదో రోజైన బుధ‌వారం పోటీల‌కు క్రీడాకారులు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతున్నారు.

Paris Olympics 2024 Day 5 : పారిస్ ఒలింపిక్స్‌లో 5వ‌ రోజు భారత షెడ్యూల్.. బ‌రిలో తెలుగు తేజాలు పీవీ సింధు, ఆకుల శ్రీజ‌

Indias Full Schedule At Paris Olympics 2024 Day 5

Paris Olympics 2024 Day 5 Schedule : పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. మంగ‌ళ‌వారం మనుబాకర్-సరబ్‌జోత్ అందించిన కాంస్య ప‌త‌క ఉత్సాహంతో ఐదో రోజైన బుధ‌వారం పోటీల‌కు క్రీడాకారులు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతున్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలు అయిన.. స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఉన్నారు. అంతేకాకుండా మనిక బత్రా టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహై కూడా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. నేడు షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో మన క్రీడాకారులు రంగంలోకి ద‌గ‌నున్నారు.

ఐదో రోజు భార‌త షెడ్యూల్‌..

షూటింగ్..
పురుషుల 50మీ.రైఫిల్ 3 స్థానాలు క్వాలిఫికేషన్ : ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె (మధ్యాహ్నం 12.30 గంటలకు)
మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్-2 : శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి ( మధ్యాహ్నం 12.30 గంటలకు)

IND vs SL : సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీ.. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఆ రెండు ఓవర్లు.. వీడియో వైరల్

బ్యాడ్మింటన్‌..
మహిళల సింగిల్స్ గ్రూపు స్టేజ్ : పీవీ సింధు వ‌ర్సెస్‌ క్రిస్టిన్ (మధ్యాహ్నం 12.50 గంటలకు)
పురుషుల సింగిల్స్ : లక్ష్యసేన్ వ‌ర్సెస్‌ జొనాథన్ – (మధ్యాహ్నం 1.40 గంటలకు)
పురుషుల సింగిల్స్ : ప్రణయ్ వ‌ర్సెస్‌ ఫాట్‌లీ (రాత్రి 11 గంటలకు)

ఈక్వెస్ట్రియన్‌..
వ్యక్తిగత డ్రెసెజ్‌ గ్రాండ్‌ ప్రి : అనూష్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

టేబుల్‌ టెన్నిస్‌..
మహిళల సింగిల్స్ : శ్రీజ వ‌ర్సెస్‌ జియాన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)

MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

బాక్సింగ్‌..
మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్ : లవ్లీనా వ‌ర్సెస్‌ సునీవా (మధ్యాహ్నం 3.50 గంటలకు)
పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్ : నిశాంత్‌ దేవ్ వ‌ర్సెస్‌ గాబ్రియల్ (రాత్రి 12.34గంట‌ల‌కు)

ఆర్చరీ..
మహిళల వ్యక్తిగత విభాగం : దీపిక కుమారి (మధ్యాహ్నం 3.56 గంటలకు)
పురుషుల వ్యక్తిగత విభాగం : తరుణ్‌దీప్ రాయ్ (రాత్రి 9.28 గంటలకు)