ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు..

ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి 96మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీల బదిలీలు..

Dsps Transfers : ఏపీలో పెద్ద ఎత్తున డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 96మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 41 మంది డీఎస్పీలకు వివిధ జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వగా.. 55 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి 96మందిని బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక, వీరిలో ఏకంగా 55 మందికి పోస్టింగ్ ఇవ్వకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినట్లుగా అర్థమవుతోంది. జగన్ పాలనలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read : మాజీ మంత్రి బొత్స ఎవరికి ఎర్త్‌ పెట్టాలని భావిస్తున్నారు? వైసీపీ నేతల వెన్నులో వణుకుపుట్టించిన వ్యాఖ్యలు