తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జగన్‌ను కలిసిన వైసీపీ కార్యకర్తలు.. భయపడొద్దని చెప్పిన వైసీపీ అధినేత

అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జగన్‌ను కలిసిన వైసీపీ కార్యకర్తలు.. భయపడొద్దని చెప్పిన వైసీపీ అధినేత

Updated On : July 31, 2024 / 4:28 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించారు జగన్.

ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి తమ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు. అనంతరం జగన్ బెంగళూరుకు కూడా వెళ్లి వచ్చారు.

 

Also Read: ఘర్ వాపసీపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ