Niharika – Chiranjeevi : చిరంజీవిపై ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను పుట్టాను.. మా నాన్న షూట్ మధ్యలో వచ్చి..

తాజాగా ఓ టీవీ షోలో నిహారిక పాల్గొనగా అక్కడ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

Niharika – Chiranjeevi : చిరంజీవిపై ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను పుట్టాను.. మా నాన్న షూట్ మధ్యలో వచ్చి..

Niharika Konidela Says Interesting Thing about her Birth Day while Chiranjeevi Song Shoot

Niharika – Chiranjeevi : నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తుంది. నిహారిక నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. దీంతో నిహారిక, మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ టీవీ షోలో నిహారిక పాల్గొనగా అక్కడ ముగ్గురు మొనగాళ్లు సినిమా ప్రస్తావన రావడంతో ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

నిహారిక మాట్లాడుతూ.. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చామంతి పువ్వా పువ్వా.. సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు నేను పుట్టాను. ఆ సినిమాకి మా నాన్నే నిర్మాత. ఓ పక్క సాంగ్ షూటింగ్ జరుగుతుంటే నేను పుట్టానని తెలిసి మధ్యలో వచ్చి సంతకం పెట్టి, నన్ను చూసి మళ్ళీ షూట్ కి వెళ్లిపోయారు అని తెలిపింది. దీంతో నిహారిక కామెంట్స్ మెగా సర్కిల్ లో వైరల్ అవుతున్నాయి.

Also Read : Devara – Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ కోసం ఎంత ఫుడ్ తెప్పించారో చూడండి.. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా?

నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా ముగ్గురు మొనగాళ్లు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి ట్రిపుల్ రోల్ చేసి మెప్పించి మంచి విజయం సాధించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1994లో రిలీజయింది. నిహారిక 1993 డిసెంబర్ లో పుట్టింది.