Nothing Phone 2a Plus: భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్.. ఫీచర్లు ఇవిగో

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 5డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000ఎంఏహెచ్..

Nothing Phone 2a Plus: భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్.. ఫీచర్లు ఇవిగో

నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ మొబైల్ ఫోన్‌ను ఇవాళ భారత్‌లో లాంచ్ చేశారు. దీని ప్రారంభ ధర రూ.27,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 4, రియల్‌మీ జీటీ 6టీ, పొకొ ఎఫ్6కి ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

  • మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్‌సెట్‌తో..
  • 6.7 అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ డిస్ప్లే
  • గ్లిఫ్ డిజైన్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా
  • బేస్ స్టోరేజ్ వేరియంట్
  • 8జీబీ, 12జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్‌ల మధ్య అందుబాటులోకి..
  • స్టోరేజ్ ఆప్షన్లు 256జీబీ వరకు
  • డ్యూయల్ 50ఎంపీ వెనుక కెమెరాలు
  • 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5

అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 5డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కేవలం 56 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 40.6 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ సామర్థ్యం ఉంటుంది.

నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ రూ.8జీబీ + 256జీబీ మోడల్‌ ధర 27,999గా ఉంది. 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. బ్లాక్, గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

Flipkart iPhone Days Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?