బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా 40 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..

చూడటానికి సుద్దపూసలా కనిపిస్తున్న ఇతగాడి పేరు బషీద్. వృత్తి సినిమాలు తీయడం, రాజకీయలు చేయడం.. మరి ప్రవృత్తి మోసాలు చేయడం.

బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా 40 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు..

Financial Fraud Case: మొన్నటి వరకు ప్రొడ్యూసర్.. నిన్నటి దాకా పొలిటిషియన్.. మరి నేడు కొత్తవేషం.. అదే దొంగవేషం. ఈ వేషంలో అతను.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కోట్లు మాయం చేయాలని ట్రై చేశాడు. కానీ పోలీసులకు అడ్డంగా బుక్కై.. ఊచలు లెక్కపెడుతున్నాడు.

చూడటానికి సుద్దపూసలా కనిపిస్తున్న ఇతగాడి పేరు బషీద్. వృత్తి సినిమాలు తీయడం, రాజకీయలు చేయడం.. మరి ప్రవృత్తి మోసాలు చేయడం. తాజాగా బషీద్ బ్యాంకు మేనేజర్, మరో బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకులో రామస్వామి అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. డెలివరీ మేనేజర్ రాజేశ్‌లు ఇద్దరు బ్యాంకుకు 40 కోట్లు నష్టం చేశారని ఇండస్ ఇండ్ బ్యాంకు జోనల్ హెడ్ మణికందన్ రామనాధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామస్వామి, రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆర్థిక మోసాల్లో ఆరితేరిన బషీద్‌ డబ్బు కోసం శంషాబాద్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రామస్వామితో కలిసి పథకం వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపాడు. రామస్వామి, రాజేశ్‌ ఇద్దరూ కలిసి ఆదిత్య బిర్లా సంస్థ ఖాతాలోని 40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్‌ ఆ డబ్బును మరిన్ని ఖాతాలకు బదిలీ చేశాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు బషీద్‌ రెండు కార్లు కొన్నాడు. తన మోసానికి సహకరించిన రామస్వామికి కారును బహుమతిగా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబై నారీమన్‌పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. సంస్థ అనుమతి లేకుండానే ఖాతా నుంచి జులై 12వ తేదీ నుంచి 40 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. ఈ సొమ్మును కుకునూరు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉన్న ఖాతాకు 25 కోట్లు, 15 కోట్ల చొప్పున బదిలీ అయ్యాయి. ఉదయ్‌కుమార్‌ లావాదేవీ జరగడానికి 8 రోజుల ముందే ఖాతా తెరవడం గమనార్హం. అనుమానాస్పద లావాదేవీ కావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ బ్రాంచి మేనేజర్‌ రామస్వామి, బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు తేలింది.

Also Read : అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్.. 25 లక్షలు పోగొట్టుకున్న మహిళా టీచర్

ఇదే సమయంలో జులై 15వ తేదీ నుంచి బ్యాంకు మేనేజర్‌ రామస్వామి విధులకు హాజరవ్వడం లేదు. ఫోన్, ఇతర మార్గాల ద్వారా సంప్రదించినా ఆచూకీ చిక్కలేదు. అనుమానమొచ్చిన బ్యాంకు అధికారులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు రామస్వామి, రాజేశ్‌ను జులై 24వ తేదీన అరెస్టు చేశారు. వారిని లోతుగా ఆరా తీయగా వారి వెనుక తెలుగు సినీ నిర్మాత బషీద్‌ ఉన్నట్లు బయటపడింది.

ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌కు చెందిన షేక్‌ బషీద్‌ తెలుగులో అనేక చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మించాడు. హైదరాబాద్‌ సీసీఎస్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, బోయిన్‌పల్లి, నార్సింగి, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్లలో 10 చీటింగ్‌ కేసులున్నాయి. నిందితుడు బషీద్ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏపీలోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు.