Swapnil Kusale : భారత్‌కు కాంస్య పతకం అందించిన షూటర్ స్వప్నిల్ గురించి తెలుసా..? ఇతడిది ధోని స్టోరీనే..
పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు.

Swapnil Kusale The Ticket Collector Who Shot India To Bronze In Olympics
Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా.. ఇతడు క్రికెట్ దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనికి విరాభిమాని మాత్రమే కాదండోయ్ ఇతడి కథ కూడా కొంచెం ధోని కథను పోలి ఉంటుంది. ధోనీ లాగే స్వప్నిల్ కూడా రైల్వేలో పని చేస్తున్నాడు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని కంబల్ వాడీ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు స్వప్నల్. అతడి తండ్రి, సోదరులు ఉపాధ్యాయులు, తల్లి గ్రామ సర్పంచ్. 2012 నుంచి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ వస్తున్న స్వప్నిల్ ఒలింపిక్స్‌లో అరంగ్రేటం చేసేందుకు 12 ఏళ్ల పాటు వేచి చూశాడు. తొలి ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటాడు.
IND vs SL: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్.. ఏకంగా ఇద్దరు..
ధోని కథను పోలి..
స్వప్నిల్ కథ టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కథను పోలి ఉంటుంది. ఇద్దరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి తమ తమ రంగాల్లో విజయం సాధించారు. ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పాటు పని చేసిన సంగతి తెలిసిందే. ఇక స్వప్నిల్ సైతం 2015 నుంచి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు.
ఇక తాను ధోనికి వీరాభిమానినని స్వప్నిల్ పలు సందర్భాల్లో చెప్పాడు. ‘నేను షూటింగ్‌లో ఏ అథ్లెట్‌ను అనుసరించను. అయితే.. బయట మాత్రం ధోని వ్యక్తిత్వానికి అభిమానిని. క్రికెట్ గ్రౌండ్‌లో ధోని ఎలా ప్రశాంతంగా ఉంటాడో అదే విధంగా నా ఆటకు కూడా ప్రశాంతత, సహనం అవసరం. నేను అతడి కథతో సంబంధం కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను కూడా టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాను.’ అని స్వప్నిల్ అన్నాడు.