మహారాష్ట్ర థానేలో తృటిలోతప్పిన పెనుప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన హోర్డింగ్.. వీడియో వైరల్

హోర్డింగ్ పడిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం పడుతుండటంతో వాహనదారులు పక్కనే ఉన్న దుకాణం వద్ద వేచిఉన్నారు.

మహారాష్ట్ర థానేలో తృటిలోతప్పిన పెనుప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన హోర్డింగ్.. వీడియో వైరల్

hoarding collapsed

Maharashtra : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. థానే ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయింది. అక్కడేఉన్న ప్రజలు భయంతో పక్కకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. థానేలోని కళ్యాణ్‌లోని సహజానంద్ చౌక్ వద్ద శుక్రవారం ఉదయం 10.18గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : ఆరోగ్యశ్రీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్

హోర్డింగ్ పడిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం పడుతుండటంతో వాహనదారులు పక్కనే ఉన్న దుకాణం వద్ద వేచిఉన్నారు. వాహనాలు రోడ్డుపక్కన పార్కింగ్ చేసి వర్షంకు షాపు వద్ద తలదాచుకున్నారు. ఈ సమయంలో బిల్డింగ్ పై ఉన్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడేఉన్న ఆటోపైన, పార్కింగ్ చేసిన వాహనాలపై పడింది. హోర్డింగ్ కొంతభాగం ఆటోపై పడింది. ఆ ఆటోలో ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే, హోర్డింగ్ పరిమాణం పెద్దగా ఉన్నప్పటికీ బరువు తక్కువగా ఉండటంతో ఆటోలోని ప్రయాణికులకు ప్రమాదం తప్పినట్లంది. అదే సమయంలో అటువెళ్తున్న విద్యార్థికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. హోర్డింగ్ పడేసమయంలో అక్కడేఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పలు వాహనాలు ధ్వంసం అయినట్లు థానే అధికారులు తెలిపారు.

Also Read : బిగ్‌ట్విస్ట్ ఇచ్చిన గద్వాల ఎమ్మెల్యే.. మళ్లీ కాంగ్రెస్ గూటికి.. సీఎం రేవంత్‌తో భేటీ

ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘాట్ కోర్ వద్ద ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి సుమారు 17మంది వరకు మృతిచెందిన విషయం తెలిసిందే. అకాల వర్షం కురవడంతో వర్షానికి తడవకుండా ఉండేందుకు పెట్రోల్ బంక్ పక్కన వాహనదారులు వేచిఉన్నారు. ఈ సమయంలో భారీ ఈదురుగాలులు రావడంతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దీంతో హోర్డింగ్ కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. 14మందికి గాయాలయ్యాయి.