ప్రమాదకరంగా చాదర్ ఘాట్ బ్రిడ్జి.. తీవ్ర భయాందోళనలో పాదచారులు, ప్రయాణికులు

పాదచారులు ముఖ్యంగా చిన్నారులు ఏ మాత్రం ఇక్కడ అదుపు తప్పినా.. బ్రిడ్జి కింద పడిపోయే ప్రమాదం ఉంది.

ప్రమాదకరంగా చాదర్ ఘాట్ బ్రిడ్జి.. తీవ్ర భయాందోళనలో పాదచారులు, ప్రయాణికులు

Chaderghat Bridge In Danger : హైదరాబాద్ లో చాదర్ ఘాట్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై రెండు వైపుల రిటైనింగ్ వాల్ కొంత భాగం విరిగిపోయింది. దీంతో పాదచారులు భయం భయంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికీ ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరింది రిటైనింగ్ వాల్. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాదిగా వాహనాలు, పాదచారులు ప్రయాణాలు చేస్తుంటారు. వంతెనకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో పాటు కొంత భాగం విరిగిపోయింది. పాదచారులు ముఖ్యంగా చిన్నారులు ఏ మాత్రం ఇక్కడ అదుపు తప్పినా.. బ్రిడ్జి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి కనీస మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై ఉన్న పలు బ్రిడ్జీలు ప్రమాదకరంగా మారాయి. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జిలు ఆలనాపాలన లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. చాదర్ ఘాట్ బ్రిడ్జి రిటైనింగ్ వాల్ కొంత భాగం విరిగిపోయినా దానికి మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జిపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. వందలాది మంది పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. బ్రిడ్జిపై నడిచి వెళ్లే వారు ఎవరైనా పొరపాటున రిటైనింగ్ వాల్ ను పట్టుకుంటే ఒక్కసారిగా కిందకు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. మూసీ మీద ఉన్న బ్రిడ్జిలకు సంబంధించి కొత్త వాటి నిర్మాణం కోసం గత ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, రిటైనింగ్ వాల్ కు రిపేర్లు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

ప్రతి ఏటా వానా కాలం సమయంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడంతో పాటు బ్రిడ్జీలకు రిపేర్లు చేయాల్సి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా మూసీ మీదున్న పదుల సంఖ్యలోని బ్రిడ్జ్ లు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు నగరంలోకి రావడానికి, నగరం నుంచి బయటకు వెళ్లడానికి ఈ బ్రిడ్జి చాలా కీలకం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానికులు సైతం ఈ బ్రిడ్జి మీదున్న ఫుట్ పాత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బ్రిడ్జికి రిపేర్లు చేయాలని గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోలేదని వాపోతున్నారు.

Also Read : ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా రూ.40 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం