అమరావతికి మహర్దశ.. రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగులు

ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?

అమరావతికి మహర్దశ.. రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగులు

Amaravati Construction : అమరావతికి మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై మళ్లీ వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం గతంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు అదే ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి కేంద్రం నుంచి కూడా సాయం అందుతోంది. సుమారు 15వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేయడంతో పనుల్లో వేగంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది సర్కార్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాజధాని నిర్మాణం కోసం ముందుగా రెండున్నరేళ్ల గడువు పెట్టుకుంది ప్రభుత్వం. ఈ రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణంలో కీలకమైన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో పాటు ఎమ్మెల్యే, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ పూర్తి చేయాలనుకుంటోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఈ నిర్మాణాలన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 2024 వరకు వీటి నిర్మాణాలు జరగలేదు. అంతేకాదు నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడే ఉండిపోయాయి అన్న విమర్శలు పెరిగాయి. గత ఐదేళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేకపోవడంతో వాటి స్థితిగతులు ఏంటి? వాటి సామర్థ్యం ఏ విధంగా ఉంది? ఆగిపోయిన నిర్మాణాల నుంచి మళ్లీ ఇప్పుడు నిర్మాణాలను కొనసాగించవచ్చా? లేక కొత్తగా నిర్మాణాలు చేపట్టాలా? అనే దానిపై సందిగ్ధత ఏర్పడింది.

దీంతో నిర్మాణ రంగ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్, చెన్నై ఐఐటీ నిపుణుల బృందాలు ఆగిపోయిన నిర్మాణాలన్నింటిని పరిశీలించారు. అయితే, నిర్మాణాలకు సంబంధించిన నివేదికలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల వేదిక వచ్చాకే ఈ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరారు సీఆర్డీయే అధికారులు.

పూర్తి వివరాలు..

Also Read : విశాఖ నగరానికి ముంచుకొస్తున్న ముప్పు..! బెంగళూరు సంస్థ అధ్యయనంలో షాకింగ్ అంశాలు