ICC : ఐసీసీ అవార్డు రేసులో ఉన్న ముగ్గురు టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎవ‌రో తెలుసా..?

జూలై నెల‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను ఐసీసీ వెల్ల‌డించింది.

ICC : ఐసీసీ అవార్డు రేసులో ఉన్న ముగ్గురు టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎవ‌రో తెలుసా..?

ICC reveals Player of the Month nominees for July

ICC Player of the Month : జూలై నెల‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్ల‌డించింది. టీమ్ఇండియా నుంచి ముగ్గురు ప్లేయ‌ర్లు నామినేట్ అయ్యారు. ఇందులో ఇద్ద‌రు మ‌హిళా క్రికెట‌ర్లు కాగా.. ఓ పురుష క్రికెట‌ర్ ఉన్నారు.

జూలై నెల‌లో అత్యుత్త‌మ ఆటతీరు ప్ర‌ద‌ర్శించ‌న ఆట‌గాళ్ల‌లోంచి షార్ట్ లిస్ట్‌ను ఐసీసీ ఎంపిక‌ చేసింది. పురుషుల క్రికెట్‌లో ముగ్గురిని, మ‌హిళ‌ల క్రికెట్‌లో ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసింది. పురుషుల క్రికెట్‌లో టీమ్ఇండియా నుంచి వాషింగ్ట‌న్ సుంద‌ర్ నామినేట్ అయ్యాడు. అత‌డితో పాటు ఇంగ్లాండ్ పేస‌ర్ గస్ అట్కిన్స‌న్‌, స్కాట్లాండ్‌ బౌలర్‌ చార్లీ కాస్సెల్ లు ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ ప‌డ‌నున్నారు.

Stunning Catch : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూసి ఉండ‌రు.. దీన్ని ఏమ‌ని పిలవాలో కాస్త చెప్ప‌రూ..?

వాషింగ్టన్‌ సుందర్ : జింబాబ్వేతో జులైలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్‌ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ నిలిచాడు. ప్ర‌స్తుతం అత‌డు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. లంక‌తో మూడు మ్యాచుల టీ20లోనూ రాణించాడు. ముఖ్యంగా మూడో టీ20లో సూప‌ర్ ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

గస్‌ అట్కిన్సన్ : ఇంగ్లాండ్‌కు చెందిన గస్‌ అట్కిన్సన్ విండీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అరంగ్రేటం చేశాడు. మూడు మ్యాచుల ఈ సిరీస్‌లో 22 వికెట్లు ప‌డ‌గొట్టి త‌న స‌త్తాను చాటాడు.

చార్లీ కాస్సెల్ : ఈ స్కాట్టాండ్ పేస‌ర్ వ‌న్డే అరంగ్రేటంలో అరుదైన గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావ‌డం గ‌మ‌నార్హం.

Paris Olympics : నీర‌జ్‌చోప్రా బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే..? మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

ఇక మ‌హిళల విభాగంలోకి శ్రీలంక కెప్టెన్‌ చమరీ ఆటపట్టుతో పాటు భార‌త ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ లు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రేసులో పోటీప‌డ‌నున్నారు.

చమ‌రీ అటపట్టు : 101.33 సగటుతో ఆసియా కప్‌లో 204 పరుగులు చేసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ పై విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది.

స్మృతి మంధన : సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. అనంత‌రం ఆ జ‌ట్టుతోనే జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్‌) రాణించింది. అంతేకాదు.. ఆసియా కప్‌లో టోర్నీలోనూ రెండు హాఫ్ సెంచ‌రీల‌తో స‌త్తా చాటింది.

షఫాలీ వర్మ: ద‌క్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసింది. ఆసియా కప్‌లోనూ రాణించింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది.

IND vs SL : వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను బెదిరించిన‌ రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌