August Long Weekend : ఆగస్టులో లాంగ్ వీకెండ్ ప్లాన్స్.. ఆఫీసులో పని తప్పించుకోవడానికి ఉద్యోగుల తంటాలు.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్..!

August Long Weekend : ఈ ఆగస్టు నెలలో కూడా లాంగ్ వీకెండ్స్ ఉండటంతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగ ఉంది. మొత్తంగా 5 రోజులతో లాంగ్ వీకెండ్ రాబోతోంది.

August Long Weekend : ఆగస్టులో లాంగ్ వీకెండ్ ప్లాన్స్.. ఆఫీసులో పని తప్పించుకోవడానికి ఉద్యోగుల తంటాలు.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్..!

August Long Weekend Sparks Buzz On The Internet, Memes Show How Employees Plan To Escape Work ( Image Source : Google )

August Long Weekend : సాధారణంగా ఉద్యోగులు వీకెండ్ అనగానే ఎగిరి గంతేస్తారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని సంబరపడిపోతుంటారు. వీకెండ్ వెళ్లిపోగానే మళ్లీ ఎప్పుడూ వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. వీకెండ్ వస్తుందని అనగానే ముందుగానే ఏం చేయాలో ప్లాన్ చేస్తుంటారు.

ఈ ఆగస్టు నెలలో కూడా లాంగ్ వీకెండ్స్ ఉండటంతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగ ఉంది. మొత్తంగా 5 రోజులతో కూడిన లాంగ్ వీకెండ్ రాబోతోంది. ఈ సమయంలో ఆఫీసుకు సెలవు పెట్టి ఫుల్ రెస్ట్ తీసుకోవాలని కొందరు ప్లాన్ చేస్తుంటే.. మరికొందరు ఏదైనా టూర్ ప్లాన్ చేయాలని తెగ లెక్కలు వేస్తుంటారు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసేది.. మిగతా రెండు రోజులు వీకాఫ్ ఉంటుంది. అంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. దీనికి తోడు పబ్లిక్ హాలీడే‌స్ కూడా కలవడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరనే చెప్పాలి. ఎందుకంటే.. చాలా ఆఫీసులకు వారానికి ఆరు రోజులు పని ఉంటుంది.

కొన్ని కంపెనీలు రక్షాబంధన్‌ను హాలిడేగా పరిగణించవు. ఇలాంటి సమయాల్లో ఉద్యోగులు సెలవు కోసం తెగ ఆరాపడుతుంటారు. ఏదో ఒక సాకు చెప్పి ఆఫీసుకు డుమ్మా కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటిదే సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సెలవు కోసం బాసుకు ఎలాంటి సాకులు చెబుతారో కడుపుబ్బా నవ్వించే మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాబోయే వీకాండ్ సంబంధించి ఉద్యోగుల బాధలపై సంబంధిత పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.

ఉద్యోగుల్లో ఎక్కువమంది పని తప్పించుకోవడానికి ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు అడుగుతుంటారు. కొంతమంది డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడుని, చాలా నీరసంగా ఉందని, పని చేయలేనంటూ ఇలా సెలవు అడిగేస్తుంటారు. రాబోయే ఆగస్టు వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఉద్యోగులు వర్క్ చేయకుండా తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు చెబుతారో కొన్ని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మీమ్‌లు, వీడియోలతో ఇంటర్నెట్ సందడిగా మారింది.

భారతీయ క్యాలెండర్ ప్రకారం.. ఆగస్ట్ 2024లో లాంగ్ వీకెండ్‌కు సంబంధించి ఫుల్ లిస్టు ట్రెండ్ అవుతుంది. గురువారం, ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం, అదే రోజున పార్సీ నూతన సంవత్సరం కూడా.. ఈరోజు నుంచే ఫస్ట్ లాంగ్ వీకెండ్ ప్రారంభమవుతుంది. ఉద్యోగులు రక్షా బంధన్‌ను పురస్కరించుకుని శుక్రవారం, ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 19, సోమవారంతో ముగిసే వరకు ఐదు రోజుల పాటు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట..

  • గురువారం, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం
  • శుక్రవారం, ఆగస్ట్ 16: సెలవు
  • శనివారం, ఆగస్టు 17: వీకెండ్
  • ఆదివారం, ఆగస్టు 18: వీకెండ్
  • సోమవారం, ఆగస్టు 19: రక్షా బంధన్
  • రెండో లాంగ్ వీకెండ్ ఆగస్టు 24 శనివారం నుంచి ప్రారంభమవుతుంది.
  • ఆగస్టు 26, సోమవారం జన్మాష్టమి వరకు ఇదే వీకెండ్ కొనసాగుతుంది.
  • రెండో లాంగ్ వీకెండ్ : 3 రోజులు
  • శనివారం, ఆగస్టు 24: వీకెండ్
  • ఆదివారం, ఆగస్టు 25: వీకెండ్
    సోమవారం, ఆగస్టు 26: జన్మాష్టమి

భారత్‌లో ఆగస్టులో వీకెండ్‌లో ఉద్యోగులు అనేక ప్లాన్స్ చేసుకోవచ్చు. చిన్న టూర్ ప్లాన్ చేయొచ్చు లేదంటే ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు. సరైన ప్లాన్‌తో ఈ వీకెండ్ సెలవులను ఎంజాయ్ చేసుకోవచ్చు.

Read Also : Zomato Veg Meal : వెజ్ మీల్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క ప్రత్యక్షం.. కస్టమర్ ఫిర్యాదుతో జొమాటో క్షమాపణలు..!