Viral Video : ముంబై లోకల్ ట్రైన్లో యువతి డ్యాన్స్.. స్టెప్పులతో అదరగొట్టిందిగా.. నెటిజన్ల రియాక్షన్..!
Viral Video : ముంబై స్టేషన్లో ఖాళీగా ఉన్న లోకల్ రైలులో కేసరి లాల్ యాదవ్ భోజ్‌పురి హిట్ “సాజ్ కే సన్వర్ కే”కి ఆ యువతిడ్యాన్స్ చేస్తూ కనిపించింది. నీలిరంగు దుస్తులు ధరించిన ముఖర్జీ తనదైన స్టెప్పులతో రెచ్చిపోయింది.
![Viral Video : ముంబై లోకల్ ట్రైన్లో యువతి డ్యాన్స్.. స్టెప్పులతో అదరగొట్టిందిగా.. నెటిజన్ల రియాక్షన్..! Viral Video : ముంబై లోకల్ ట్రైన్లో యువతి డ్యాన్స్.. స్టెప్పులతో అదరగొట్టిందిగా.. నెటిజన్ల రియాక్షన్..!](https://10tv.in/wp-content/uploads/2024/08/Viral-Video-of-Girl-Dancing-in-Mumbai-Local-Train-Sparks-Mixed-Reactions.jpg)
Viral Video of Girl Dancing in Mumbai Local Train Sparks Mixed Reactions ( Screenshot Grab from Video )
Viral Video : సోషల్ మీడియా క్రేజ్ కోసం పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు. కొన్నిసార్లు సరదా కోసం చేసిన రీల్స్, షార్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు యువతకు ఎంటర్టైన్మెంట్ జోన్లుగా మారిపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ యువతి వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. అంకిత అనే పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దియా ముఖర్జీ పోస్ట్ చేసిన క్లిప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ముంబై స్టేషన్లో ఖాళీగా ఉన్న లోకల్ రైలులో కేసరి లాల్ యాదవ్ భోజ్‌పురి హిట్ “సాజ్ కే సన్వర్ కే”కి ఆ యువతిడ్యాన్స్ చేస్తూ కనిపించింది. నీలిరంగు దుస్తులు ధరించిన ముఖర్జీ తనదైన స్టెప్పులతో రెచ్చిపోయింది. ఒకవైపు పాట ప్లే అవుతుండగా.. మ్యూజిక్ తగినట్టుగా హావాభావాలను పలికిస్తూ అదరగొట్టేసింది. అదే సమయంలో రైలులో కూర్చొన్న ఓ యువకుడు ముఖర్జీ వెనుక నుంచి అకస్మాత్తుగా లేచి బ్యాక్ చూపిస్తూ ఫన్నీగా డ్యాన్స్ చేయడం కడుపుబ్బా నవ్వించేలా ఉంది. అతడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యానికి గురైన ముఖర్జీ ఒక్కసారిగా అవాక్కయింది.
పాట ఆగిపోయిన వెంటనే ఆ వ్యక్తి తన సీటులో కూర్చొన్నాడు. ఇప్పుడు వీడియోకు ఊహించని స్పందన వస్తోంది. ఇది యువతి, యువకులు కలిసి ప్లాన్ ప్రకారమే చేశారా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది అస్పష్టంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 4.3 మిలియన్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లతో ఇన్ఫ్లుయెన్సర్ ముఖర్జీ ఈ వీడియోతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 5.5 మిలియన్ కన్నా ఎక్కువ వ్యూస్ రాగా, దాదాపు 2లక్షల మంది యూజర్లు లైక్ కొట్టారు. వేలకొద్దీ షేర్లు, కామెంట్లు తెగ వచ్చిపడుతున్నాయి. వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
అమృత అనే యూజర్.. రైలులో డ్యాన్స్ చేయడం సరికాదని, ప్రైవేట్ మోడ్‌లో వీడియోను సేవ్ చేయాలని విమర్శించారు. మరో యూజర్ మాత్రం.. శుభమ్.. హాస్యభరితంగా ముఖర్జీని “డ్రై లేడీఫింగర్”తో పోల్చారు. ఆమె డ్యాన్స్ చేసే ముందు ఎక్కువ తినాలని సూచించారు. ముఖర్జీ డ్యాన్స్‌పై స్పందిస్తూ మరో నెటిజన్ ఇతరులకు టిప్స్ ఇచ్చే ముందు బరువు పెరగడంపై దృష్టిపెట్టాలని సూచించారు.
View this post on Instagram