Nita Ambani : ఇండియా హౌస్‌లో పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు.. మను భాకర్, స్వప్పిల్ కుసాలేలను సత్కరించిన నీతా అంబానీ

Nita Ambani : ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు మొత్తం 3 పతకాలు రాగా, అందులో షూటింగ్‌లోనే మూడూ కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది.

Nita Ambani : ఇండియా హౌస్‌లో పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు.. మను భాకర్, స్వప్పిల్ కుసాలేలను సత్కరించిన నీతా అంబానీ

Mrs Nita M Ambani _ Beyond medals and records, Sport is a celebration of the human spirit

Nita Ambani : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఒలింపిక్ కాంస్య పతక విజేతలుగా నిలిచిన మను భాకర్, స్వప్నిల్ కుసాలేలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ఘనంగా సత్కరించారు.

ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 6) ఇండియా హౌస్‌లో వారిని సత్కరించారు. అందులో షట్లర్ లక్ష్య సేన్, షూటర్లు విజయవీర్ సింగ్ సిద్ధూ, మహేశ్వరి చౌహాన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రైజా ధిల్లాన్, అనీష్ బన్వాలా, బాక్సర్ నిశాంత్ దేవ్, షాట్ పుట్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ టూర్‌తో సహా పలువురు అథ్లెట్లు, అథ్లెట్ జెస్విన్ ఆల్డ్రిన్ కూడా ఉన్నారు.

Read Also : Bajaj Chetak 3201 Edition : కొత్త స్కూటర్ ఇదిగో.. అమెజాన్‌లో బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్, ధర ఎంతో తెలుసా?

ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు షూటింగ్ కాంటెంజెంట్‌ను నీతా అంబానీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో షూటింగ్ కంటెంజెంట్ టాప్ ఫామ్‌ను ప్రదర్శించిందని అన్నారు. గీతలో ఇచ్చిన జ్ఞానాన్ని మను అనుసరించిందని కూడా ప్రశంసలతో ముంచెత్తారు.

పతకాలు, రికార్డులకు అతీతంగా :
“ఈ ఒలింపిక్స్‌లో భారత షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ (స్వప్నిల్)లో పతకం సాధించిన మొదటి భారతీయుడు. మన ప్రాచీన గ్రంథం భగవద్గీతలో ‘మీ వంతు కృషి చేయండి. మిగిలిన వాటిని భగవంతుడికి వదిలివేయండి’ అని బోధిస్తుంది. మూడు ఏళ్ల తరువాత ఆమె చేసింది అదే.. ఆమె తన కెరీర్ మాత్రమే కాకుండా దేశం విధిని కూడా మార్చింది ”అని నీతా అంబానీ అన్నారు.

Mrs Nita M Ambani _ Beyond medals and records, Sport is a celebration of the human spirit

Mrs Nita M Amban

మలేషియాకు చెందిన జియ్ జియా లీపై కాంస్య పతకాన్ని సాధించి ఒలంపిక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచినందుకు నీతా అభినందించారు. పతకాలు, రికార్డులకు అతీతంగా క్రీడ మానవుల వేడుకగా పేర్కొన్నారు. స్పిరిట్, క్యారెక్టర్, హార్డ్ వర్క్ అన్ని అసమానతలను ఎదుర్కొనే ఎప్పటికీ వదులుకోలేని మన సామర్థ్యం. అథ్లెట్లలో ప్రతి ఒక్కరూ ప్యారిస్‌లో ఆ స్ఫూర్తిని ప్రదర్శించారు. మీ అందరినీ, టీమిండియా ఛాంపియన్స్‌గా నిలిచినందుకు గర్విస్తున్నాం. మీ అత్యుత్తమ ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు” అని అంబానీ పేర్కొన్నారు.

భారత్‌కు మొత్తం 3 పతకాలు :
ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు మొత్తం 3 పతకాలు రాగా, అందులో షూటింగ్‌లోనే మూడూ కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఈ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత మొట్టమొదటి మహిళా షూటర్‌గా నిలిచింది.

ఆ తర్వాత సరబ్‌జోత్ సింగ్, మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (మిక్స్‌డ్ టీమ్) ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. టీమ్ షూటింగ్‌లో దేశానికి మొట్టమొదటి పతకం. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడు కూడా అతడే కావడం విశేషం.

Read Also : ISRO Free Courses : విద్యార్థులకు ఇస్రో ఆఫర్.. ఫ్రీగా 5 రోజుల ఏఐ, మిషన్ లెర్నింగ్ కోర్సు.. సర్టిఫికేట్ కూడా..!