Youtube Academy : ఏపీలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు..!

Youtube Academy : యూట్యూబ్‌ గ్లోబల్‌ సీఈవో, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ గుప్తాతో ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లోకల్ పార్టనర్లతో రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు.

Youtube Academy : ఏపీలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు..!

AP CM Chandrababu naidu Discussions with Youtube Academy in Andhra Pradesh State

Youtube Academy : ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే యూట్యూబ్‌ గ్లోబల్‌ సీఈవో నీల్ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో యూట్యూబ్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు. ఆన్‌లైన్‌ వేదికగా సమావేశమైన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా సీఎం వెల్లడించారు.

Read Also : ISRO Free Courses : విద్యార్థులకు ఇస్రో ఆఫర్.. ఫ్రీగా 5 రోజుల ఏఐ, మిషన్ లెర్నింగ్ కోర్సు.. సర్టిఫికేట్ కూడా..!

యూట్యూబ్‌ గ్లోబల్‌ సీఈవో, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ గుప్తాతో ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లోకల్ పార్టనర్లతో రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు. యూట్యూబ్‌ అకాడమీతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఏఐ, కంటెంట్‌, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌‌లను ప్రోత్సహించడానికి స్థానిక భాగస్వాముల సహకారంతో ఏపీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాజధాని అమరావతిలో మీడియా సిటీ చొరవకు సాంకేతిక సాయం అందించే మార్గాలను అన్వేషించినట్టు తెలిపారు.

Read Also : Nita Ambani : ఇండియా హౌస్‌లో పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు.. మను భాకర్, స్వప్పిల్ కుసాలేలను సత్కరించిన నీతా అంబానీ