Paris Olympics 2024: ఫైనల్లో తలపడనున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌.. నేడు మనవాళ్ల షెడ్యూల్ ఇదిగో..

అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో వినేశ్ ఫోగాట్ వర్సెస్ ఆన్ సారా హిల్డెబ్రాండ్

Paris Olympics 2024: ఫైనల్లో తలపడనున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌.. నేడు మనవాళ్ల షెడ్యూల్ ఇదిగో..

పారిస్ ఒలింపిక్స్ 2024లో బుధవారం జరిగే ఫైనల్లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అమెరికా రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌‌తో తలపడనుంది. ఇప్పటికే మహిళల 50 కేజీల విభాగంలో ఆమె సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్‌ లోపేజ్‌‌ను ఓడించిన విషయం తెలిసిందే. మరోవైపు, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం జరిగే జావెలిన్ త్రో ఫైనల్స్ ఈవెంట్‌లో పాల్గొంటాడు. ఇది రేపు రాత్రి 11.55 గంటలకు ప్రారంభమవుతుంది.

ఒలింపిక్స్‌లో నేడు మనవాళ్లు..

అథ్లెటిక్స్
ఉదయం 11 గంటలకు: మారథాన్ రేస్ వాక్ రిలే మిక్స్‌డ్ ఫైనల్ గోల్ఫ్‌లో సూరజ్ పన్వర్/ప్రియాంక గోస్వామి

గోల్ఫ్
మధ్యాహ్నం 12.30 గంటలకు: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌లో అదితి అశోక్, దీక్షా దాగర్ రౌండ్ 1

అథ్లెటిక్స్
మధ్యాహ్నం  1.35 గంటలకు: పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ గ్రూప్ బీలో సర్వేష్ అనిల్ కుషారే

మధ్యాహ్నం 1.45 గంటలకు: మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 హీట్ 4లో జ్యోతి యర్రాజి

మధ్యాహ్నం 1.55 గంటలకు: మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో అన్నూ రాణి

రెజ్లింగ్
మధ్యాహ్నం  2.30 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల రౌండ్ ఆఫ్ 16లో యాంటిమ్ పంఘల్ వర్సెస్ జైనెప్ యెట్గిల్ (టర్కీ)

మధ్యాహ్నం 4.20 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల క్వార్టర్‌ఫైనల్‌లో యాంటీమ్ పంఘల్ (అర్హత సాధిస్తే)

మధ్యాహ్నం 10.25 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల సెమీఫైనల్‌లో యాంటీమ్ పంఘల్ (అర్హత సాధిస్తే)

అథ్లెటిక్స్

రాత్రి 10. 45 గంటలకు: పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్‌లో ప్రవీణ్ చిత్రవేల్ (గ్రూప్ ఏ), అబ్దుల్లా నారంగోలింటెవిడ (గ్రూప్ బీ)

వెయిట్‌లిఫ్టింగ్
రాత్రి 11 గంటలకు: మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను

రెజ్లింగ్
అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో వినేశ్ ఫోగాట్ వర్సెస్ ఆన్ సారా హిల్డెబ్రాండ్ (అమెరికా)

అథ్లెటిక్స్
అర్ధరాత్రి దాటాక 1.13 గంటలకు : పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాష్ సేబుల్

Vinesh Phogat : వినేశ్ ఫోగ‌ట్ ప‌ట్టు అదిరింది.. ప‌త‌కానికి అడుగు దూరంలో..