IND vs SL 3rd ODI : కీల‌క‌మైన మూడో వ‌న్డేకు ముందు.. కోహ్లీ, రోహిత్ నుంచి గిల్ బ్యాటింగ్ చిట్కాలు..

శ్రీలంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 0-1తో వెనుక‌బ‌డి ఉంది.

IND vs SL 3rd ODI : కీల‌క‌మైన మూడో వ‌న్డేకు ముందు.. కోహ్లీ, రోహిత్ నుంచి గిల్ బ్యాటింగ్ చిట్కాలు..

Gill takes batting tips from Kohli and Rohit ahead of 3rd ODI vs Sri Lanka

IND vs SL : శ్రీలంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 0-1తో వెనుక‌బ‌డి ఉంది. ఈ క్ర‌మంలో కీల‌క మైన ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్‌కు భార‌త్ సిద్ద‌మ‌వుతోంది. బుధ‌వారం కొలంబో వేదిక‌గా జ‌రిగే ఈమ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో నెట్స్‌లో ఆట‌గాళ్లు తీవ్రంగా చ‌మ‌టోడ్చుతున్నారు. కాగా.. టీమ్ఇండియా వైస్ కెప్టెన్, ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల నుంచి బ్యాటింగ్ చిట్కాలు తీసుకున్నాడు.

వాస్త‌వానికి గ‌త కొంత‌కాలంగా శుభ్‌మ‌న్ గిల్ పెద్ద‌గా ఫామ్‌లో లేడు. తొలి వ‌న్డేలో 35 బంతులు ఎదుర్కొని 16 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక రెండో వ‌న్డేలో 44 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల‌తో 35 ప‌రుగుల‌తో ఫ‌ర్వాలేద‌నిపించాడు. మొత్తంగా రెండు వ‌న్డేల్లో క‌లిపి 51 ప‌రుగులు చేశాడు. ఇది త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న కాదు. ఈ క్ర‌మంలోనే మూడో వ‌న్డేలో స‌త్తా చాటాల‌ని గిల్ భావిస్తున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాల‌ని అనుకుంటున్నాడు.

IND vs SL : శ్రేయ‌స్ అయ్య‌ర్‌, దూబెలు ఔట్ అయ్యారంటే అర్థం ఉంది.. కోహ్లీ ఇలా ఔట్ అవుతున్నాడంటే..?

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ప్రాక్టీస్ సెష‌ల్ లో గిల్ త‌న ఆట‌తీరును మెరుగుప‌ర‌చుకునేందుకు కోహ్లీ, రోహిత్ సాయం కోరిన‌ట్లుగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్ త‌న క‌థ‌నంలో తెలిపింది. స్పిన్ ఎదుర్కొన‌డం పై, ఇన్నింగ్స్‌ను నిర్మించ‌డం పై సూచ‌న‌లు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గిల్ 46 వ‌న్డేల్లో 59.5 స‌గ‌టుతో 2322 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 శ‌త‌కాలు, 13 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.