Gold Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ కొంటున్నారా? అయితే..

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ కొంటున్నారా? అయితే..

GOld Rate Today

Gold and Silver Price Today : బంగారం, వెండి ధరల్లో హచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన తరువాత అమాంతం తగ్గిన బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో మళ్లీ పెరిగాయి.. ఆ తరువాత మళ్లీ తగ్గిన గోల్డ్ రేటు.. తాజాగా మరోసారి పెరిగింది. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరగింది. మరోవైపు కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.

 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,090.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,400 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,240.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,250 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,090.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,090 వద్ద కొనసాగుతుంది.

 

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.88,000.
కోల్ కతా, ఢిల్లీలో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 3,500 తగ్గింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 83,000 వద్ద కొనసాగుతుంది.
ముంబయిలో కిలో వెండి ధర రూ. 86,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 5,750 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 80,750 వద్ద కొనసాగుతుంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.