Mercedes Benz : ఐకానిక్ నేమ్ ‘మెర్సిడెస్ బెంజ్’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సీఈఓ చెప్పిన స్టోరీ..!
Mercedes Benz : అమెరికన్ లాయర్, వ్యాపారవేత్త డేవిడ్ రూబెన్‌స్టెయిన్‌తో మాట్లాడుతూ.. మెర్సిడెస్-బెంజ్ సీఈఓ స్టెన్ ఓలా కల్లెనియస్ పాపులర్ బ్రాండ్‌కు దాని పేరు ఎలా వచ్చిందో వివరించారు.
Mercedes Benz : బ్రాండ్ అనేది కంపెనీ పాపులారిటీని సూచిస్తుంది. పేరు ఏదైనా అనేక దిగ్గజ బ్రాండ్‌ల వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి కంపెనీ పేరు ఐకానిక్ నేమ్ పెట్టడానికి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ప్రఖ్యాత కార్ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ దాని పేరును ఎలా పొందింది అనే దానిపై వీడియో వైరల్ అయింది.
Read Also : Vivo V40 Pro Series : వివో నుంచి సరికొత్త వి40 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
అమెరికన్ లాయర్, వ్యాపారవేత్త డేవిడ్ రూబెన్‌స్టెయిన్‌తో మాట్లాడుతూ.. మెర్సిడెస్-బెంజ్ సీఈఓ స్టెన్ ఓలా కల్లెనియస్ పాపులర్ బ్రాండ్‌కు దాని పేరు ఎలా వచ్చిందో వివరించారు. 1886లో గాట్లీబ్ డైమ్లెర్ స్థాపించినప్పుడు కార్ల కంపెనీకి మొదట డైమ్లర్ అని పేరు పెట్టారని ఆయన చెప్పారు.
ఆ సమయంలో, డైమ్లర్ చీఫ్ ఇంజనీర్ విల్హెల్మ్ మేబ్యాక్. పదిహేనేళ్ల తర్వాత, ఆస్ట్రియన్ పారిశ్రామికవేత్త ఎమిల్ జెల్లినెక్ రేసింగ్ ప్రయోజనాల కోసం ఇంజిన్‌ను రూపొందించడానికి డైమ్లర్, మేబ్యాక్‌లను నియమించారు. జెల్లినెక్ ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగే రేసులో పాల్గొని రేసు విజేత కావాలని కోరుకున్నాడు. డైమ్లెర్, మేబ్యాక్ నిజానికి జెల్లినెక్ కోరికను నెరవేర్చారు. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కూడిన వాహనాన్ని అప్పట్లో ఇచ్చారు.
Mercedes-Benz CEO Ola Källenius shares how the name ‘Mercedes’ came about. pic.twitter.com/h7xh29lYv3
— Historic Vids (@historyinmemes) June 12, 2024
జెల్లినెక్ రేసులో విజేతగా నిలిచారు. దానికి ఒక షరతు పెట్టారు. దాంతో కారుకు అతని కుమార్తె ‘మెర్సిడెస్’ పేరు పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా, డైమ్లెర్ పేరును ఇష్టపడి కారును ‘మెర్సిడెస్’గా మార్చేయాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ తన కంపెనీ అసలు పేరును కొనసాగించింది. కల్లెనియస్ ప్రకారం.. అలాంటి పేరును ఎంచుకోవడానికి కారణం.. డైమ్లర్ అమితంగా ఇష్టపడటమే. అలా, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ పొందిన బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్‌లో భాగమైంది.
బ్రాండ్ పేరుగా ‘మెర్సిడెస్’ :
మెర్సిడెస్ బెంజ్ వెబ్‌సైట్ ప్రకారం.. జూన్ 23, 1902న ‘మెర్సిడెస్’ బ్రాండ్ పేరుగా రిజిస్టర్ అయింది. సెప్టెంబర్ 26న లీగల్ నేమ్ పొందారు. జూన్ 1903లో ఎమిల్ జెల్లినెక్ భవిష్యత్తులో జెల్లినెక్-మెర్సిడెస్ పేరుతో అనుమతి పొందారు. ‘ఒక తండ్రి తన కుమార్తె పేరు పెట్టడం బహుశా ఇదే మొదటిసారి’ అని సందర్భంగా వ్యాఖ్యానించారు.
1907లో జెల్లినెక్ ఆస్ట్రో-హంగేరియన్ కాన్సుల్ జనరల్‌గా నియమితులయ్యారు. కొంతకాలం తర్వాత మెక్సికన్ కాన్సుల్ అయ్యారు. 1909లో జెల్లినెక్ ఆటోమోటివ్ వ్యాపారం నుంచి వైదొలిగారు. మొనాకోలోని ఆస్ట్రో-హంగేరియన్ కాన్సులేట్ అధిపతిగా విధులకు అంకితమయ్యారు. జనవరి 21, 1918న ఆయన మరణించే వరకు ఎమిల్ జెల్లినెక్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో ఆసక్తిగల పరిశీలకుడిగా ఉన్నారు.
Read Also : Realme 13 4G Launch : సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి 13 4జీ ఫోన్.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?