New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

ఇక నుంచి విద్యార్థులు.. టీచ‌ర్ల‌కు, తోటీ స్నేహితుల‌కు ప‌ల‌క‌రింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్ప‌కూడ‌దు.

New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

Jai Hind to replace good morning in Haryana schools from Aug 15

ఇక నుంచి విద్యార్థులు.. టీచ‌ర్ల‌కు, తోటీ స్నేహితుల‌కు ప‌ల‌క‌రింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్ప‌కూడ‌దు. జై హింద్ అని చెప్పాలి. ఈ విధానం ఆగ‌స్టు 15 నుంచి అన్నిప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థులు త‌ప్ప‌క పాఠించాల్సి ఉంటుంది. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. హ‌రియాణా రాష్ట్రంలో. ఈ మేర‌కు అక్క‌డి పాఠ‌శాల విద్యా డైరెక్ట‌రేట్ ఓ స‌ర్య్కూల‌ర్ జారీ చేసింది.

అన్ని విద్యాసంస్థ‌ల‌కు, విద్యాశాఖ‌ ఉన్న‌తాధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. చిన్న‌ప్ప‌టి నుంచే విద్యార్థుల్లో దేశ భ‌క్తి, గౌర‌వం, ఐక్య‌తా భావాల‌ను పెంపొందించాల‌నే ఆలోచ‌న‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలియ‌జేశారు. ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున జాతీయ జెండాను ఎగుర‌వేసే ముందు నుంచి దీన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్..

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా దేశంలో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు. జైహింద్ నినాదంతో ప్ర‌జ‌ల‌ను ఒక్క‌టి చేసిన‌ట్లుగా అందులో పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో నాయ‌కులు ఒక‌రికి ఒక‌రు జైహింద్ అని చెప్పుకుంటూ ప‌ల‌క‌రించుకునేవారు.

స్వాత్రంత్య అనంత‌రం దేశ సాయుధ ద‌ళాలు ఈ నినాదాన్ని గ్రీటింగ్‌గా స్వీక‌రించాయి. దేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల వారి నిరంత‌ర నిబద్ధతను ఇది ప్ర‌తీక‌.