తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు బిగ్ షాకిచ్చిన మొదటి భార్య.. పెళ్లిపీటల మీద నుంచి పరార్
రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య బిగ్ షాకిచ్చింది. దీంతో పెళ్లిపీఠలపైనుంచి భర్త పరారయ్యాడు. ఊహించని ఘటనతో నూతన వధువు ..

Second Marriage Row : రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య బిగ్ షాకిచ్చింది. దీంతో పెళ్లిపీఠలపైనుంచి భర్త పరారయ్యాడు. ఊహించని ఘటనతో నూతన వధువు ఆమె బంధువులు కంగుతిన్నారు. అయితే, మొదటి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు నూతన వధువు, వారి బంధువులను పోలీస్ స్టేషన్ తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ పెద్దపెండ్యాలకు చెందిన సంధ్యకు జి. రాకేశ్ తో గతంలో పెళ్లి జరిగింది. వీరికి కుమార్తె ఉంది. అయితే, వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.
విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. విడాకుల వ్యవహరం కొలిక్కిరాకముందే రెండో పెళ్లికి రాకేశ్ సిద్ధమయ్యాడు. తిరుమల సిద్ధేశ్వర మఠంలో గుట్టు చప్పుడు కాకుండా రెండవ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. మఠంలో రాకేశ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సమాచారం తెలుసుకున్న మొదటి భార్య సంధ్య.. కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది. విడాకులు ఇవ్వకుండా వేరే మహిళను ఎలా పెళ్లి చేసుకుంటావ్ అంటూ ప్రశ్నించింది.
Also Read : ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్
దీంతో వరుడు రాకేశ్ పెళ్లి పీఠల పైనుంచి పరారయ్యాడు. రాజకీయ అండదండలతో తనను చంపుతానని రాకేశ్ బెదిరిస్తున్నాడని మొదటి భార్య సంధ్య.. తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన కుమార్తెకు పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.