భారత్‌ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణాలేంటి?

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణాలేంటి?

గల్వాన్‌ ఘర్షణ అయిపోయింది. అరుణాచల్‌లో కుట్రలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంతటితోనే డ్రాగన్ కుట్రలు ఆపడం లేదు. తన ఆధిపత్య కుట్రలకు ఎప్పుడూ కొత్త రూట్ వెతుక్కుంటుంది చైనా. భారతే చైనాకు టార్గెట్‌ అయినా.. ముందుగా పొరుగు దేశాలను డిస్ట్రబ్ చేస్తూ వస్తోంది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు తర్వాత.. డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. భారత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలను ఒక్కొక్క దానిని ఖతం చేస్తూ వస్తోంది డ్రాగన్ కంట్రీ.

పాక్ మనకు ముందు నుంచి దాయాది దేశం. అక్కడి నుంచే ఆపరేషన్ స్టార్‌ చేసింది చైనా. నవాజ్ షరీఫ్‌ హయాంలో భారత్‌తో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కథ ముగించేసింది డ్రాగన్. తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతియుత వాతావరణం ఉండేందుకు ప్రయత్నించారు.

సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ను పూర్తికాలం పదవిలో కొనసాగనివ్వలేదు చైనా. యుక్రెయిన్‌ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయనను పట్టుబట్టి మరీ తప్పించారు. దీనివెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెంచుతూ..అక్కడ గ్వాదర్ ఓడరేవును డెవలప్‌ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది డ్రాగన్ కంట్రీ.

దీని వెనక చైనా వ్యూహాలు..
నేపాల్‌ భారత్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండే దేశం. పూర్తిగా హిందూ దేశమైన నేపాల్‌కు భూకంపం సమయాల్లో భారత్‌ అండగా నిలిచింది. అలాంటి నేపాల్‌ ప్రచండ ప్రధానిగా ఉన్నంత వరకు బానే ఉంది. అతడ్ని తప్పించి.. ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధాని అయ్యారు. దీని వెనక చైనా వ్యూహాలు ఉన్నాయని ప్రచారం ఉంది. భారత్‌ అంటేనే గిట్టని వ్యక్తిగా పేరున్న కేపీ శర్మ.. 2021కి ముందు వరకు రెండుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఆయన పీఎం అయ్యాక నేపాల్‌ కూడా భారత్‌కు ధమ్కీలు ఇవ్వడం సార్ట్ చేసింది.

నేపాల్ తర్వాత శ్రీలంకలో ఆపరేషన్ చేసింది చైనా. శ్రీలంక ప్రధానిగా రాజపక్సే ఉన్నప్పుడు భారత్‌తో స్నేహం కొనసాగించారు. సామరస్య పూర్వకంగా ఉంటూ మన సాయం పొందారు. ఈ ఎన్విరాన్‌మెంట్‌ను డిస్ట్రబ్ చేసేందుకు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా చేసింది చైనా.

ధరల పెరుగుదల, రోజుల తరబడి ఆందోళనలతో.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే మీద తిరుగుబాటు జరిగింది. చివరకు గొటబాయ రాజపక్సే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రధాని అయిన దినేష్ గుణవర్ధనే చైనా చెప్పుచేతల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సేమ్‌టైమ్‌ శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును అభివృద్ధి చేసి.. ఓడరేవుపై పెత్తనం చెలాయిస్తోంది చైనా.

మాల్దీవులు విషయంలో..
ఆ తర్వాత చైనా కుట్రలు..భారత్‌, మాల్దీవుల రిలేషన్‌పైకి షిఫ్ట్ అయ్యాయి. డ్రాగన్ కంట్రీ ఆడిన నాటకంలో మాల్దీవులు పావు అయింది. మనకు చాలా సన్నిహిత దేశంగా ఉన్న మాల్దీవులు..ఆ దేశానికి మొహమ్మద్ మొయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూరం అవుతూ వచ్చింది. ఇండియా టూరిస్టుల మీద ఆధారపడి బతికే మాల్దీవులు కంట్రీని రెచ్చిగొట్టి రచ్చకీడ్చింది చైనా. భారత్‌తో వివాదం తర్వాత మాల్దీవులకు దగ్గరై సాయం చేయడం సార్ట్ చేసింది.

ఇప్పుడు బంగ్లాదేశ్‌ వంతు కూడా అయిపోయింది. బంగ్లాదేశ్‌లో ఆరు నెలల క్రితం హల్‌చల్‌ చేసిన బాయ్‌కాట్‌ ఇండియా ఉద్యమం వెనక డ్రాగన్ కంట్రీ ఉందన్న ప్రచారం ఉంది. భారత వస్తువులను బహిష్కరించాలని మొదలైన ఉద్యమం..రిజర్వేషన్ల పోరాటంతో అట్టుడికింది. దీనంతటికి కారణం షేక్ హసీనాను గద్దె దించే ప్రయత్నమే. ఆమె భారత్‌తో సన్నిహతంగా ఉండటాన్ని తట్టుకోలేని డ్రాగన్..కుట్రలు చేసి హసీనాను గద్దె దించడంలో సక్సెస్ అయింది.

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు భారత్‌ వ్యతిరేక వైఖరితో ఉన్నాయి. అంతేకాదు బంగ్లాదేశ్‌లో ప్యారా ఓడరేవును డెవలప్‌ చేసేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవును, శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును అభివృద్ధి చేసినట్లే.. శ్రీలంకకు భారీ రుణం ఇస్తామని చెప్పి.. హంబన్‌తోట పోర్టును చైనా 99 సంవత్సరాలు లీజుకు తీసుకుంది.

భారత్‌ టార్గెట్‌గా డ్రాగన్ కంట్రీ చేసే కంత్రి పనులకు..ఒక్కో దేశం బలవుతూ వస్తోంది. పాక్‌ తర్వాత నేపాల్‌..శ్రీలంక తర్వాత మాల్దీవులు ఇప్పుడు బంగ్లాదేశ్ డ్రాగన్ బాధిత దేశాలుగా నిలిచాయి. ఇక పొరుగు దేశాలైన మయన్మార్, అప్ఘనిస్థాన్ చైనా హిట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. అప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారత్‌కు అనుకూలంగా ఉన్నారు. మయన్మార్‌ మనతో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఈ రెండు దేశాల్లో చైనా పెట్టుబడులు పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: ఇండియా హౌస్‌లో పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు.. మను భాకర్, స్వప్పిల్ కుసాలేలను సత్కరించిన నీతా అంబానీ