తెల్లపూర్ టెక్నోసిటీలో మైహోమ్ అక్రిద.. సూపర్‌ కనెక్టివిటీతో మరో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్

తెల్లపూర్ టెక్నోసిటీలో మైహోమ్ అక్రిద పేరుతో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 11న లాంచ్ కాబోతోంది.

తెల్లపూర్ టెక్నోసిటీలో మైహోమ్ అక్రిద.. సూపర్‌ కనెక్టివిటీతో మరో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్

My Home New Project Akrida in Tellapur techno city

My Home New Project Akrida : మైహోమ్ గ్రూప్ నిర్మాణ రంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్న సంస్థ. అంచెలంచెలుగా ఎదిగి దేశంలోని ప్రముఖ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. అఫర్డబుల్, లగ్జరీ ఇళ్ల నిర్మాణంలో బ్రాండ్ గా నిలుస్తోంది. నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, నాణ్యమైన ఇళ్లను అందిస్తోంది. కొన్ని వేల మంది సొంతింటి కలను నెరవేర్చిన మైహోమ్ గ్రూప్ ఇఫ్పుడు తెల్లపూర్ టెక్నోసిటీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. మైహోమ్ అక్రిద పేరుతో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 11న లాంచ్ కాబోతోంది.

హైదరాబాద్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్టు అంటే ముందుగా గుర్తొచ్చే సంస్థ మైహోమ్. ఎన్నో విశిష్ట ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మైహోమ్‌ గ్రూపు నమ్మకమైన పెట్టుబడిగా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది.. హైదరాబాద్‌లో నంబర్ వన్ రియల్ ఎస్టేట్ బ్రాండ్‌గా మారింది.. మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు సారథ్యంలో రియల్ ఎస్టేట్, సిమెంట్, పవర్ కన్సల్టెన్సీ, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోకి తన కార్యకలాపాలను విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులతో సుమారు 5 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌తో వృద్ధిపథంలో దూసుకుపోతుంది మైహోమ్‌ గ్రూప్‌. ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన మైహోమ్‌ సంస్థ.. ఇప్పుడు మెగా ప్రాజెక్ట్‌ అక్రిదతో వస్తోంది.

కస్టమర్లే బ్రాండ్ అంబాసిడర్లు
కస్టమర్ల డబ్బుకు పూర్తి విలువనిచ్చి నాణ్యమైన గృహాలను నిర్మించి ఇవ్వడం ద్వారా.. వారి కళ్లలో కనిపించే సంతోషంలోనే విజయ రహస్యం ఉందని మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు చెబుతుంటారు. మైహోమ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేసిన కస్టమర్స్ పూర్తి సంతృప్తితో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేస్తారని ఆయన నమ్ముతారు. మైహోమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసిన ఇంటి విలువ గణనీయంగా పెరగడం ఎంతోమందిని లాయల్‌ కస్టమర్లుగా మార్చింది. అందుకే, మైహోమ్‌ ఏ ప్రాజెక్ట్ లాంఛ్ చేసినా.. మొదటిరోజే భారీ స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరుగుతాయి. ఇప్పుడు తెల్లాపూర్ దగ్గర భారీ ప్రాజెక్టు చేపడుతోంది. మై హోమ్ అక్రిద పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

అక్రిద ప్రాజెక్టులో 12 హైరైజ్ టవర్స్
అక్రిద ప్రాజెక్టులో భాగంగా మెుత్తం 24.99 ఎకరాల్లో 12 హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నారు. 39 అంతస్తులు ఉండే ఈ 12 టవర్లలో 3 వేల 780 ఫ్లాట్లు నిర్మాణం చేస్తోంది మైహోమ్‌ గ్రూప్‌. 2 , 2.5, 3 BHK ఫ్లాట్లు అందుబాటులోకి తెస్తోంది. 13 వందల 99 చదరపు అడుగుల నుంచి 2 వేల 347 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. సిటిజన్స్ ఎమినిటిస్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మై హోం సంస్థ.. అక్రిద ప్రాజెక్టులో 81 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉంచుతోంది. ఇందులో 1.5 లక్షల విస్తీర్ణంతో రెండు క్లబ్‌హౌస్‌లు నిర్మిస్తోంది. ఔట్ డోర్ జిమ్, బాస్కెట్ బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్, హంపీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, పెట్ జోన్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్టు వంటి సౌకర్యాలు కస్టమర్లకోసం ఏర్పాటు చేస్తున్నారు.

ఇక తెల్లాపూర్ టెక్నో సిటిలో మై హోం గ్రూప్‌ ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసింది. మై హోం అక్రిదకు ఇరువైపుల భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. మై హోం సయూక్‌లో పలు టవర్ల నిర్మాణం చివరిదశకు చేరుకుంది. మై హోం అవలి ప్రాజెక్టు కూడా వేగంగా నిర్మాణం జరుగుతోంది. మై హోం త్రిదశ పూర్తి అవ్వగా.. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభమైంది. మరోవైపు మై హోం విపిన టవర్స్‌లో వేగంగా పని జరుగుతోంది.

అక్రిద ప్రాజెక్టుకు సూపర్‌ కనెక్టివిటీ
మై హోం అక్రిద ప్రాజెక్టుకు సూపర్‌ కనెక్టివిటీ ఉంది. ప్రముఖ పాఠశాలు అతి దగ్గర్లోనే ఉన్నాయి. తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌కు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌, ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం పది నిముషాల్లో చేరుకునే అవకాశం ఉంది. విశాలమైన రోడ్డు నెట్ వర్క్ అందుబాటులో ఉంది. పలు ఆస్పత్రులు, మాల్స్ 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 35 నిముషాల్లో రీచ్ అయ్యేలా అక్రిదను నిర్మిస్తున్నారు. అత్యంత సౌకర్యవంతంగా, అత్యంత అధునాతనంగా వస్తున్న అక్రిద హైదరాబాద్‌లో మరో ల్యాండ్‌ మార్క్‌గా మారడం ఖాయమంటోన్న మైహోమ్‌ కొనుగోలుదారులందరికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతోంది.