Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి
గాజాలో ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ..

Israel attacks on Gaza
Israeli Attack on school in Gaza City : గాజాలో ఓ పాఠశాలలో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు వంద మందికిపైగా మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం.. ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంలోని ఆల్ సహాబా ప్రాంతంలో ఆల్ తబాయీన్ పాఠశాలపై బాంబు దాడికి పాల్పడిందని, ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఈ ఘటనను భయంకరమైన ఊచకోతగా అభివర్ణించాడు. కొందరు శరీరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయని తెలిపాడు. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం.. హమాస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు చెప్పింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం తన వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు అందించలేదు.