Instagram New Update : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు పండగే.. ఇకపై సింగిల్ పోస్టులో 20 ఫొటోలు పంపుకోవచ్చు..!

Instagram New Update : ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది.

Instagram New Update : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు పండగే.. ఇకపై సింగిల్ పోస్టులో 20 ఫొటోలు పంపుకోవచ్చు..!

Your Instagram Post can now include up to 20 images ( Image Source : Google )

Instagram New Update : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అదిరే అప్‌డేట్.. ఎండ్‌గాడ్జెట్ నివేదిక ప్రకారం.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కరోజల్ పోస్ట్‌లో ఫొటోలు, వీడియోలను రెట్టింపు సంఖ్యలో యాడ్ చేసుకోవచ్చు. అవును.. మీరు చదివింది నిజమే.

Read Also : Instagram Single Reel : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై సింగిల్ రీల్స్‌లో 20 సాంగ్స్ వరకు యాడ్ చేయొచ్చు..!

ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. ప్రతిచోటా వినియోగదారులు వారి జ్ఞాపకాలు, క్రియేటివిటీ లేదా రోజువారీ పనులకు సంబంధించి ఫొటోలు, వీడియోలను పంపుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రతి మూమెంట్ షేర్ చేసేందుకు ఇష్టపడే వారికి ఈ కొత్త ఫీచర్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ 2017లో కరోజల్ ఫీచర్ తిరిగి ప్రవేశపెట్టింది. ట్రావెల్ డైరీ అయినా లేదా మీమ్‌లైనా మల్టీ ఫొటోలను లేదా వీడియోలను కలిపి పోస్టు చేయొచ్చు. ఒక వైపు, కంటెంట్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బిజినెస్ వినియోగదారులు ఈ కొత్త అప్‌డేట్‌ను ఇష్టపడే అవకాశం ఉంది.

మీడియా అంటే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి, స్టోరీలను పోస్టు చేయడం, ప్రొడక్టులను ప్రదర్శించడానికి మరిన్ని మార్గాలను పొందవచ్చు. ఈ మార్పుతో మరింత క్రియేటివిటీతో రిచ్ కంటెంట్‌ను షేర్ చేసేందుకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. కానీ సగటు వినియోగదారుకు లేదా వారి ఫాలోవర్లకు 20 ఫొటోలను స్క్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపరు. కొంత మంది యూజర్లు యాడ్ చేసిన వివరాలను అభినందిస్తున్నప్పటికీ, మరికొందరికి విసుగు పుట్టించవచ్చు.

షేరింగ్, ఓవర్‌షేరింగ్ విషయంలో ఈ అప్‌డేట్ కొంతమంది వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని ఎలా వాడాలని అనుకుంటున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఆలోచనాత్మకంగా ఉపయోగించినట్లయితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు చెప్పే విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

కానీ, కంటెంట్ అతిగా పోస్టు చేస్తే.. ఫాలోవర్లు “మ్యూట్” బటన్‌ను నొక్కవచ్చు. మీరు ప్రతి మూమెంట్ డాక్యుమెంట్ చేయడానికి ఇష్టపడే వారైనా లేదా పరిమితి మించి క్వాలిటీ ఇష్టపడే ఫాలోవర్లు అయినా ఈ అప్‌డేట్‌తో మీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌పీరియన్స్ మరింత యాక్సస్ చేయొచ్చు. ఇంకా చాలా ఎక్కువ మంది యూజర్లు వీక్షించడానికి షేర్ చేసేందుకు వీలుంటుంది.

Read Also : Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. ఆగస్టు 15నే లాంచ్.. డిజైన్, ఫీచర్లు భలే ఉన్నాయిగా..!