మెస్మరైజింగ్.. మింగేసిన పాముని మళ్లీ బయటకు తెచ్చి వదిలేసిన భారీ అనకొండ

శరీరాన్ని మెలికలు తిప్పుతూ దాని నోటి నుంచి పామును బయటకు వచ్చేలా చేసింది.

మెస్మరైజింగ్.. మింగేసిన పాముని మళ్లీ బయటకు తెచ్చి వదిలేసిన భారీ అనకొండ

ఓ భారీ అనకొండ మింగేసిన పాముని మళ్లీ బయటకు తెచ్చి వదిలేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొదట ఓ అనకొండ చిన్న పామును మింగి.. ఆ తర్వాత శరీరంలో ఏదో సమస్యతో బాధపడుతున్నట్లు కనపడింది.

శరీరాన్ని మెలికలు తిప్పుతూ దాని నోటి నుంచి పామును బయటకు వచ్చేలా చేసింది. ఆ చిన్నపాము బయటకు వచ్చిన సమయంలో అది అప్పటికే చనిపోయినట్లు కనపడింది. అయితే, ఊహించని రీతిలో ఆ చిన్న పాము కదలడం ప్రారంభించి, అక్కడి నుంచి పాకుతూ వెళ్లిపోయింది. ఈ వీడియోపై నెటిజన్లు అమితాసక్తి కనబర్చుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ చిన్న పామును భారీ అనకొండ తిని, మళ్లీ బయటకు తీసుకువచ్చిన దృశ్యం నమ్మశక్యంగా లేని విధంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘నేను ఎన్నో జంతువుల వీడియోలు చూశాను.. కానీ, ఇటువంటి వీడియోను ఎన్నడూ చూడలేదు’’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రకృతిలో ఇటువంటి ఘటనలు సాధారణంగానే జరుగుతుంటాయని కొందరు కామెంట్లు చేశారు.

Also Read: బాంబు బెదిరింపు.. మాల్స్‌ నుంచి కస్టమర్లు, సిబ్బందిని ఖాళీ చేయించిన పోలీసులు