Prabhas – Iman Esmail : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా హీరోయిన్ ఈమె.. స్టార్ డ్యాన్సర్‌ని తీసుకొచ్చారుగా..

ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఈమె అనే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది.

Prabhas – Iman Esmail : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా హీరోయిన్ ఈమె.. స్టార్ డ్యాన్సర్‌ని తీసుకొచ్చారుగా..

Prabhas Hanu Raghavapudi Movie Fauji Actress Iman Esmail Photos Videos goes Viral

Updated On : August 17, 2024 / 2:09 PM IST

Prabhas – Iman Esmail : ప్రభాస్ కల్కి తర్వాత ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అధికారికంగా ఈ ఈవెంట్ నుంచి ఫొటోలు, వీడియోలు రిలీజ్ కాకపోయినా అక్కడికి వెళ్లిన వారి దగ్గర్నుంచి పలు ఫొటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఈమె అనే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది. ఇంతకీ ఈమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఇమాన్ చిన్నప్పట్నుంచి డ్యాన్సర్. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరోపక్క చదువు పూర్తిచేసింది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో ఇమాన్ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా. ఇమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అలాంటి డ్యాన్సర్ ని ప్రభాస్ సరసన తీసుకోవడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by YouWe Media (@youwemedia)

Also Read : Prabhas – Hanu Raghavapudi : అన్ని పక్కనపెట్టేసి.. హనుతో సినిమా మొదలుపెట్టిన ప్రభాస్..

ఇప్పుడు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో ఇమాన్ ఇస్మాయిల్ కనపడటంతో ఈమె హీరోయిన్ అని, ప్రభాస్ పక్కన నటించబోతుందని వార్త వైరల్ అవుతుంది. ఈమె ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఇమాన్ కు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరగడమే కాక ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె వీడియోల కింద వెల్కమ్ టు టాలీవుడ్ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. పూజ కార్యక్రమంలో లీక్ అయిన ఒక వీడియో, ఫొటోతోనే ఇమాన్ ఇస్మాయిల్ సోషల్ మీడియాని ఒక్కసారిగా ఊపేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)