Prabhas – Hanu Raghavapudi : అన్ని పక్కనపెట్టేసి.. హనుతో సినిమా మొదలుపెట్టిన ప్రభాస్..
నేడు ఉదయం ప్రభాస్ - హను రాఘవపుడి సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

Prabhas Hanu Raghavapudi Fauji Movie Opening Pooja Ceremony
Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా షూట్ జరుగుతుంది. అయితే రాజాసాబ్ తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్.. సినిమాలు ఉంటాయనుకున్నాను. కానీ ఆ సినిమాలన్నీ పక్కన పెట్టేసి ప్రభాస్ హను రాఘవపూడితో సినిమా మొదలుపెట్టాడు.
నేడు ఉదయం ప్రభాస్ – హను రాఘవపుడి సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ పూజా కార్యక్రమం నుంచి అధికారికంగా ఫొటోలు ఇంకా రాకపోయినా ప్రభాస్ ఫొటోలు లీక్ అయి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో లవ్ స్టోరీ కథ అని, సినిమా టైటిల్ ‘ఫౌజీ’ అని టాలీవుడ్ సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధురైలో ఈ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
Darling #Prabhas at #PrabhasHanu Pooja ceremony.
@hanurpudi @MythriOfficial pic.twitter.com/IVIbj77Evg
— BA Raju's Team (@baraju_SuperHit) August 17, 2024
Also Read : Sree Vishnu : హీరో శ్రీవిష్ణు భార్య, కూతురుని చూశారా? భార్య బర్త్ డే రోజు స్పెషల్ ఫోటో షేర్ చేసి..
హను రాఘవపూడి అంటే క్లాసిక్ లవ్ స్టోరీలు ఇస్తాడు. ఇటీవలే సీతారామం సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ని మరోసారి ఒక క్లాసిక్ లవ్ స్టోరీలో చూడొచ్చు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Darling #Prabhas at #PrabhasHanu Pooja ceremony.
@hanurpudi @MythriOfficial pic.twitter.com/mXWH7cyjbF
— BA Raju's Team (@baraju_SuperHit) August 17, 2024