Roshan – Champion : హమ్మయ్య.. శ్రీకాంత్ కొడుకు సినిమా లైన్లోకి వచ్చింది.. ‘కల్కి’ డైరెక్టర్ చేతుల మీదుగా ‘ఛాంపియన్’..
తాజాగా రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చింది.

Srikanth Son Roshan New Movie Champion Pooja Ceremony by Kalki Director Nag Ashwin
Roshan – Champion : ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో ‘పెళ్లిసందD’ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
Also Read : Prabhas – Iman Esmail : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా హీరోయిన్ ఈమె.. స్టార్ డ్యాన్సర్‌ని తీసుకొచ్చారుగా..
పెళ్లిసందD సినిమా తరవాత రోషన్ మూడు సినిమాలు ప్రకటించాడు. కానీ ఆ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చింది. కల్కి సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో గత సంవత్సరం రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు ఈ ఛాంపియన్ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.
??? ??????????… #Champion ?#Roshan @PradeepAdvaitam pic.twitter.com/xzctVdSVhg
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 17, 2024
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రోషన్ పై క్లాప్ కొట్టి సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఛాంపియన్ సినిమా షూట్ మొదలవ్వనుంది. సినిమా ప్రకటించిన తర్వాత సంవత్సరానికి సినిమా మొదలవ్వడంతో ఇప్పటికైనా స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారు. మరి ఛాంపియన్ సినిమాతో రోషన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.