Nidhhi Agerwal : ‘రాజాసాబ్’ షూట్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ప్రభాస్ ఏమో వేరే సినిమా ఓపెనింగ్‌లో..
ప్రభాస్ సినిమా రాజాసాబ్ గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూట్ జరుగుతుంది.

Actress Nidhhi Agerwal Birthday Celebrations in Prabhas Rajasaab Movie Sets
Nidhhi Agerwal : డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమా రాజాసాబ్ గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూట్ జరుగుతుంది. ప్రభాస్ తో పాటు హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్.. ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం మాళవిక బర్త్ డే రాజాసాబ్ సెట్స్ నుంచి సెలెబ్రేట్ చేసి ఈ హీరోయిన్ ని కన్ఫర్మ్ చేసారు.
Also Read : Prabhas – Hanu Raghavapudi : అన్ని పక్కనపెట్టేసి.. హనుతో సినిమా మొదలుపెట్టిన ప్రభాస్..
ఇవాళ ఇంకో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేట్ చేసి ఆమెని కూడా కన్ఫర్మ్ చేసారు. నేడు హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో రాజాసాబ్ షూటింగ్ సెట్లో ఈ హీరోయిన్ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసారు. డైరెక్టర్ మారుతీతో పాటు మూవీ యూనిట్ ఈ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ లేడు. నేడు ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమం జరగడంతో ప్రభాస్ ఆ ఓపెనింగ్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఇక రాజాసాబ్ సెట్స్ లో నిధి అగర్వాల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి.
Team #TheRajaSaab is thrilled to welcome the stunning @AgerwalNidhhi on board!? Celebrating her birthday on set with loads of love and excitement.?#TheRajaSaabOnApril10th #Prabhas @DirectorMaruthi @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @SKNOnline @MalavikaM_… pic.twitter.com/Csq1ls5cjV
— People Media Factory (@peoplemediafcy) August 17, 2024