బిస్కెట్లు తిని 257 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రి పాలైన 80 మంది పిల్లలు

ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఛత్రపతి సంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి పంపించామని చెప్పారు.

బిస్కెట్లు తిని 257 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రి పాలైన 80 మంది పిల్లలు

బిస్కెట్లు తిని 80 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేకేట్ జల్గావ్ గ్రామంలోని జిల్లా కౌన్సిల్ పాఠశాలకు చెందిన 257 మంది విద్యార్థులకు పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా సిబ్బంది బిస్కెట్లు ఇచ్చారు.

బిస్కెట్లు తిన్నాక అందరు విద్యార్థులు వికారం, వాంతులతో బాధపడ్డారని స్థానిక అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థుల్లో చాలా మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

బిస్కెట్లు తిన్న 257 మందిలో 153 మందిని ఆసుపత్రికి తీసుకురాగా, వారిలో 80 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వివరించారు. మిగతా వారికి చికిత్స అందించి వెంటనే ఇంటికి పంపామని చెప్పారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఛత్రపతి సంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి పంపించామని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Missing Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన కుర్రాడు