Chilli Farming : షేడ్ నెట్‌లలో మిర్చి నారు పెంపకం.. నర్సరీతో ఉపాధి పొందుతున్న రైతు

Chilli Farming : ఏ పంట అభివృద్ది అయినా, ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి , నాణ్యత, మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి.

Chilli Farming : షేడ్ నెట్‌లలో మిర్చి నారు పెంపకం.. నర్సరీతో ఉపాధి పొందుతున్న రైతు

A self employed farmer chilli farming with a nursery management in prakasam district

Chilli Farming : ఏ పంటలో అయినా.. నాణ్యమైన దిగుబడి పొందాలంటే, నాటే నారు ఆరోగ్యవంతంగా ఉండాలి. కూరగాయల సాగులో రైతులంతా ఇప్పుడు నర్సిరీలపై నే ఆదారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ది పరిచి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షేడ్ నెట్ నర్సరీని ఏర్పాటు చేసి, ప్రోట్రేలలో మొక్కలను పెంచుతూ… రైతులకు అందిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Read Also : Green Chilli Cultivation : ఏడాది పొడవునా పచ్చిమిర్చి సాగు – మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు

ఏ పంట అభివృద్ది అయినా, ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి , నాణ్యత, మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి. ఒక వేళ  ఏదైనా తప్పు జరిగితే, కష్టంతో పాటు , పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది.  ఇది దృష్టిలో పెట్టుకోనే కూరగాయ తోటలను సాగుచేసే రైతులు నర్సరీలపై ఆదారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా, రైతులకు కావల్సిన నారును  అభివృద్ది చేసి అందిస్తున్నాయి.

దీంతో నెలరోజుల పాటు రైతుకు సమయం కలిసి రావడమే కాకుండా మొక్క దృఢంగా పెరిగి మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారముంది. కాబట్టి షేడ్ నెట్ నర్సరీలతో ఇటు రైతులకు, అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు చేకూరుతుంది. ఇది గమనించి ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, తాడిచర్ల గ్రామానికి చెందిన రైతు ఈశ్వరయ్య నర్సరీని ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన నార్లను పెంచి ఇస్తున్నారు. తనతో పాటు మరో  మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు