లంచాలు తీసుకుని.. దర్జాగా కూర్చొని పంచుకున్న పోలీసులు.. వీడియో చూస్తారా?

ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఆ ముగ్గురు పోలీసుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లని,

లంచాలు తీసుకుని.. దర్జాగా కూర్చొని పంచుకున్న పోలీసులు.. వీడియో చూస్తారా?

ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచాలు మరిగారు. రోడ్డుపై వాహనాలను ఆపడం, వాహనదారులను బెదిరించడం, వారి నుంచి డబ్బు తీసుకుని వదిలేయడం వంటి పనులు చేస్తున్నారు. వచ్చిన డబ్బునంతా ఒక చోట దాచి డ్యూటీ అయిపోయే సమయానికి ముగ్గురూ కూర్చొని ఆ డబ్బుని పంచుకుంటున్నారు.

తాజాగా వారు డబ్బులు పంచుకుంటూ కెమెరాకు చిక్కారు. ఇందకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇలా బయటపడింది. థ్రిల్ లారీ సర్కిల్‌లోని గాజీపూర్‌లోని పోలీసు చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఆ ముగ్గురు పోలీసుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లని, మరొకరు కానిస్టేబుల్ అని అధికారులు తెలిపారు. లంచాలు తీసుకుని, దర్జాగా కూర్చుని ఆ డబ్బుని వారు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా ప్రతిరోజు లంచాల రూపంలో ట్రాఫిక్ పోలీసులు వేలాది రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: పాము ఆవలిస్తే ఎట్టా ఉంటుందో చూడండి..