Viral Video: డిప్యూటీ కలెక్టర్‌ను లాఠీతో కొట్టిన పోలీసు.. ఎందుకంటే?

ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. డాక్ బంగ్లా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేసి..

Viral Video: డిప్యూటీ కలెక్టర్‌ను లాఠీతో కొట్టిన పోలీసు.. ఎందుకంటే?

రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి బుధవారం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో బంద్ పాటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రోడ్డుపై డిప్యూటీ కలెక్టర్‌ను ఆందోళనకారుడిగా భావించి, ఆయనపై లాఠీ ఝుళిపించాడు ఓ పోలీసు. ఈ ఘటన కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై నిరసన తెలుపుతూ బిహార్ రాజధాని పాట్నాలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. డాక్ బంగ్లా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్ల వాడడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు.

అక్కడకు చేరుకున్న జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీకాంత్ కుండ్లిక్ ఖండేకర్‌ను గుర్తుపట్టకుండా ఆయనను ఆందోళనకారుడిగా భావించిన ఓ పోలీసు వెనక నుండి లాఠీతో కొట్టాడు. దీంతో ఆయన డిప్యూటీ కలెక్టర్ అని, తోటి పోలీసులు అతడికి చెప్పారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌కి ఆ పోలీసు సారీ చెప్పాడు. డిప్యూటీ కలెక్టరును కూడా పోలీసు గుర్తు పట్టకపోవడం ఏంటంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మంచుకొండల్లో మంట పుట్టిస్తున్న పాలిటిక్స్‌