Naveen Polishetty : యాక్సిడెంట్ తర్వాత అసలు చెయ్యి పనిచేయదేమో అనుకున్నా.. చేతికి కట్టుతోనే సింగింగ్ షోకి నవీన్ పోలిశెట్టి..
చేతికి కట్టుతోనే నవీన్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చి అలరించాడు నవీన్ పోలిశెట్టి.

Naveen Polishetty in Aha Telugu Indian Idol Season 3 after his Accident
Naveen Polishetty : తెలుగు ఓటీటీ ఆహా ప్రతి వారం కొత్త సినిమాలు, కొత్త షోలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 సాగుతుంది. ప్రతివారం ఎవరో ఒకరు స్పెషల్ గెస్టుగా వస్తున్నారు. తాజాగా ఈ వారం వచ్చే ఎపిసోడ్ కి హీరో నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వచ్చాడు.
తన ఎంటర్టైన్మెంట్ తో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అందర్నీ నవ్వించే హీరో నవీన్ పోలిశెట్టి. అయితే నవీన్ పోలిశెట్టి ఇటీవల కొన్నాళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ కు గురవడంతో కుడి చెయ్యికి బాగా గాయాలు అయి సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే నవీన్ ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇప్పుడు చేతికి కట్టుతోనే నవీన్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చి అలరించాడు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
Also Read : Chiranjeevi – Tirumala : తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి.. పుట్టిన రోజు నాడు స్వామి వారి దర్శనం.. వీడియో వైరల్
నవీన్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుందని తెలిసిందే. షోలో వచ్చిన దగ్గర్నుంచి తన కామెడీతో అందర్నీ నవ్వించాడు. అలాగే స్టేజిపై హిందీ పాట పాడి అదరగొట్టాడు. ఇక తన చేతి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. యాక్సిడెంట్ అయ్యాక నా చెయ్యి అసలు పనిచేయదేమో అనుకున్నా. చెయ్యి కొంచెం పైకి లేగడానికే రెండు నెలలు పట్టింది. దీనికి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మానసికంగా హ్యాపీగా ఉండటానికి మ్యూజిక్ నాకు మెడిసిన్ గా పనిచేసింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో షోలో ఉన్నవాళ్ళంతా కూడా ఎమోషనల్ అయ్యారు. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి..
ప్రోమోలోనే తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్, పాటలతో కంటెస్టెంట్స్, జడ్జ్ లని, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు నవీన్. నవీన్ యాక్సిడెంట్ అయిన క్షణాల గురించి కూడా కామెడీగా ఆచెప్పి నవ్వులు పూయించాడు. ప్రోమోలోనే ఈ రేంజ్ ఉందంటే ఎపిసోడ్ లో నవీన్ ఇంకే రేంజ్ లో కామెడీ చేసారో అని ఎదురుచూస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో 21, 22వ ఎపిసోడ్‌లలో నవీన్ పోలిశెట్టి రాగా ఈ ఎపిసోడ్స్ ఆహాలో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ అవ్వనున్నాయి.