అంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ విమానంలో వెళ్లకుండా రైళ్లలో యువకుడి ప్రయాణం.. ఎందుకంటే?

అతడు ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 30 లక్షల రూపాయలకు పైగా

అంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ విమానంలో వెళ్లకుండా రైళ్లలో యువకుడి ప్రయాణం.. ఎందుకంటే?

లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ పాత చేతి గడియారాన్నే పెట్టుకుంటారు కొందరు.. ఎందుకలా అని అడిగితే ఆ చేతి వాచీ తమ తల్లిది లేదా తండ్రిదని చెబుతుంటారు. అలాగే, కొత్త బైకు కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ కొందరు పాత బైకునే నడిపిస్తుంటారు.

ఆ బైకు తమ తండ్రిదని అది వాడడమే ఇష్టమని చెబుతుంటారు. సెంటిమెంట్ అలాంటిది మరి.. ఈ సెంటిమెంట్ వల్లే ఓ యువకుడు విమానంలో వెళ్లకుండా రైళ్లలో ప్రయాణిస్తున్నాడు. అతడి గురించి చిరాగ్ దేశ్ ముఖ్ అనే యువకుడు తన ఎక్స్ ఖాతాలో వివరాలు తెలిపాడు. ‘ఇవాళ నేను రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ యువకుడు ఎక్కాడు.

అతడు ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 30 లక్షల రూపాయలకు పైగా సంపాదించే వ్యక్తి అతడు. అంత సంపాదిస్తుంటే విమానంలో ప్రయాణించకుండా రైలులో ఎందుకు ప్రయాణిస్తున్నావని అడిగాను. దీంతో అతడు సమాధానం చెబుతూ.. తన కాలేజీ చదువు తర్వాత తనకు ఉద్యోగం రాలేదని, ఒక రోజు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఓ వ్యక్తి కలిశాడని అన్నాడు.

ఉద్యోగం పొందడానికి అతడు సాయం చేశాడని తెలిపాడు. అప్పటి నుంచి ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అత్యవసరమైతే తప్ప.. మిగతా సమయాల్లో రైలులోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు’ అని దేశ్ ముఖ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Also Read: ‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ అనౌన్స్?