‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్‌లుక్ విడుదల.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా
సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడే పి.రవిశంకర్. ‘సుబ్రహ్మణ్య’ సినిమాలో..
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్య’ సినిమా రూపుదిద్దుకుంటోంది. సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడే పి.రవిశంకర్. ‘సుబ్రహ్మణ్య’ సినిమాలో పి.రవిశంకర్ కుమారుడు అద్వాయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాన నుంచి ప్రీ లుక్ విడుదల చేయగా, ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
దీన్ని కన్నడ సూపర్ స్టార్ డా.శివ రాజ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్లో హీరో అద్వాయ్ జుమపాల జుట్టుతో, గడ్డంతో కనపడుతున్నాడు. వెనుక నుంచి దోపిడీదారులు తరుముకు వస్తుంటే వారితో పోరాడే వీరుడిగా అద్వాయ్ పై సీన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముంబైలోని రెడ్ చిల్లీస్ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలో విడుదల కానుంది.
Also Read: పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ వచ్చేసింది..