Video: ఓ చోట 500 కిలోల లడ్డూ.. మరో చోట లడ్డూలు తినే పోటీ

ఆ స్వీట్ షాప్‌ను దాదాపు 140 సంవత్సరాల క్రితం ప్రారంభించారు.

Video: ఓ చోట 500 కిలోల లడ్డూ.. మరో చోట లడ్డూలు తినే పోటీ

వినాయక చవితి అంటే మనకు గణనాథుడి చేతిలో ఉండే లడ్డూ కూడా గుర్తుకురాక మానదు. దేశ వ్యాప్తంగా ఎన్ని గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారో అన్ని విగ్రహాల వద్ద లడ్డూ ఉండకతప్పదు. దేశ వ్యాప్తంగా రకరకాల లడ్డూలను తయారు చేస్తూ గణేశుడికి నైవేద్యంగా పెడుతుంటారు.

గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని ఒక స్వీట్ షాప్ 500 కిలోల భారీ లడ్డూను తయారు చేసింది. ఆ స్వీట్ షాప్‌నకు పెద్ద చరిత్రే ఉంది. బలరామ్ ముల్లిక్, రాధారామన్ ముల్లిక్ పేరిట ఆ స్వీట్ షాప్‌ను దాదాపు 140 సంవత్సరాల క్రితం ప్రారంభించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్వీట్ షాప్ నిరాటకంగా కొనసాగుతోంది. లడ్డూను తయారు చేయడానికి కొన్ని రోజుల పాటు శ్రమించారు. దీని గురించి ఆ స్వీట్ షాప్ యజమానురాలు ప్రియాంక మాట్లాడుతూ.. గణేశ్ చతుర్థి తమకు చాలా పవిత్రమైన రోజని, ఈ ఏడాది గణేశుడికి నైవేద్యంగా పెట్టేందుకు 500 కిలోల లడ్డూను సిద్ధం చేశామని తెలిపారు.

మరోవైపు, గుజరాత్‌లోని జామ్ నగర్‌లో లడ్డూలు తినే పోటీని నిర్వహించారు. ఒక్కోలడ్డూ 12 గ్రాములు ఉంటుంది. మొత్తం 288 లడ్డూలను 49 మంది పోటీదారులు తిన్నారు. అతి వేగంగా 12 లడ్డూలు తిన్న వారిని విజేతగా తేల్చారు.

Also Read : వినాయక చవితి సందర్భంగా మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..