Chilli Cultivation : ప్లాస్టీక్ ట్రేలలో మిరపనారు పెంపకం, సూచనలు!

అతిగా రసానిక ఎరువులు వాడటం మంచిది కాదు. చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప నారు పొలంలో నాటటానికి 5 రోజుల ముందు నీటి తడులు ఇవ్వటం నిలిపివేయాలి.

Chilli Cultivation : ప్లాస్టీక్ ట్రేలలో మిరపనారు పెంపకం, సూచనలు!

Chilli cultivation in plastic trays, instructions!

Chilli Cultivation : సాంప్రదాయ పద్దతిలో మిరపనారుమడి పద్దతి కాకుండా ఇటీవలి కాలంలో చాలా మంది రైతులు ప్లాస్టిక్ ట్రేలలో మిరపనారు పెంపకం పద్దతిని అనుసరిస్తున్నారు. ప్లాస్టిక్ ట్రేల పద్దతిలో నారు పెంపకం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందులను అధిగమించి మెరుగైన, నాణ్యమైన, నారు అత్యధిక మొలక శాతం కలిగి వేరు వ్యవస్ధ బలపడటానికి దోహదం చేస్తుంది.

నారు దశలో అత్యధికంగా చీడపీడలను తట్టుకునే శక్తి కలిగి ఉండటంతో పంట దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. నర్సరీ ట్రేలలో నారు దూర ప్రాంతాలకు సులభంగా తరలించే అవకాశం ఉంటుంది.

ట్రేలలో విత్తనాన్ని విత్తుకునే ముందు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వాతావరణ పరిస్ధితులకు అనుగుణమైన చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. విత్తనాన్ని ముందుగానే థైరాం లేదా కాప్టాన్ తో శుద్ధి చేసుకోవాలి.

నర్సరీ ట్రేలు శుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ట్రేలను ఒక శాతం క్లోరైడ్ బ్లీచ్ కలిపిన నీటితో శుభ్రపరుచుకోవాలి. మిరప పంటకు అనువైన ట్రే 98 నుండి 110 రంధ్రాలు కలవి ఎంపిక చేసుకోవాలి.

నారు పెంపకానికి ఉపయోగపడే మాధ్యమం కోకోపిట్ వర్మిక్యులైట్ ని 4;1 నిష్పత్తిలో కలుపుకొని ట్రేల రంధ్రాలలో ఖాళీ లేకుండా నింపుకోవాలి. ఆ మాధ్యమం యొక్క ఉదజని సూచిక 5.5, 6.5 మధ్య ఉండేలా జాగ్రత్తలు పాటిస్తే సూక్ష్మ పోషక లోపాలను నివారించుకోవచ్చు.

మాధ్యమంలో మట్టిలేకుండా చూసుకున్నట్లైతే మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు. ప్రతి రంధ్రంలో మధ్య భాగన 0.5 నుండి 1 సెం.మీ లోతులో ఒక్కొక్క విత్తనాన్ని మాత్రమే నాటుకొని అదే మట్టితో కప్పివేయాలి. ప్రతి రంద్రం పూర్తిగా తడిచేటట్లు నీటి తడిని ఇవ్వాలి.

ఇలా చేస్తే వేరు వ్యవస్ధ కింది వరకు వృద్ధి చెందుతుంది. ఆకుకు సంబంధించిన తెగుళ్లను నివారించటానికి మధ్యహ్నం సమయంలో నీటి తడులు ఇవ్వకూడదు. నీటిలో కరిగే ఎరువులను 30 నుండి 75 గ్రా వాడినట్లైతే స్ధూల, సూక్ష్మలోపాలు లేకుండా నివారించవచ్చు.

అతిగా రసానిక ఎరువులు వాడటం మంచిది కాదు. చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప నారు పొలంలో నాటటానికి 5 రోజుల ముందు నీటి తడులు ఇవ్వటం నిలిపివేయాలి. షేడ్ నెట్ల క్రింద ట్రేలలో నారు పెంచే వారే నాటేందుకు సన్నద్ధమతున్న మూడు రోజుల ముందు ట్రేలను షెడ్ ల నుండి సూర్యరశ్మి తగిలేలా బయట ఉంచాలి.