Intercrop in Coconut : ఒక పెట్టుబడితో నాలు పంటల దిగుబడి తీస్తున్న రైతు

కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా వక్కసాగును సైతం రైతులు చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా కోకోతో పాటు వక్కను సాగుచేశారు.

Intercrop in Coconut : ఒక పెట్టుబడితో నాలు పంటల దిగుబడి తీస్తున్న రైతు

Intercrop in Coconut

Updated On : October 2, 2023 / 3:40 PM IST

Intercrop in Coconut : కొబ్బరిలో సాధారణంగా కోకోను మాత్రమే పండిస్తారు. కానీ  ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు  కోకోతోపాటు వక్క, మిరియాల పంటలు సాగు చేస్తూస్తున్నారు. ఒకే పెట్టుబడితో నాలుగు పంటల నుండి దిగుబడిని తీస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతే కాదు మిగితా తోటల్లో కూడా మిరియాలను సాగుచేసుకునేందుకు నర్సరీని పెంచుతున్నారు.

READ ALSO : Dairy Management : గేదెల డెయిరీ నిర్వాహణలో రిటైర్డ్ ఇంజనీర్.. పాలను డోర్ డెలివరీ చేస్తూ లాభాలు

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా ఉంటుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో  ఉద్యాన అధికారులు అంతరపంటగా కోకో సాగును ప్రోత్సహించటంతో పరిస్థితి మెరుగైంది.

READ ALSO : Healthy Heart : ఆరోగ్యకరమైన గుండె కోసం ఒత్తిడిని దూరం చేయటానికి చిట్కాలు !

మరోవైపు కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా వక్కసాగును సైతం రైతులు చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా కోకోతో పాటు వక్కను సాగుచేశారు.

READ ALSO : Amazon Dolphins : అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్లు మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు

అయితే కొబ్బరి, వక్క మొక్కలు ఎత్తుగా పెరుగుతుండటంతో ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో మిరియాల మొక్కలు నాటి.. వాటికి పాకించారు. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో మిగితా తోటలో కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మిరియం నర్సరీని పెంచుతున్నారు రైతు.