Silkworms Cultivation : పట్టుపరిశ్రమకు విసృత్త రాయితీలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సాగు

కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా చేయూతనందిస్తున్నాయి . ముఖ్యంగా రేరింగ్‌ గది నిర్మాణం, రేరింగ్‌ పరికరాల,  క్రిమి సంహారక మందులు,  కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను రాయితీతో ఇస్తున్నారు.

Silkworms Cultivation : పట్టుపరిశ్రమకు విసృత్త రాయితీలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సాగు

Silkworms Cultivation

Silkworms Cultivation : వ్యవసాయానుబంధంగా, గ్రామీణ కుటీర పరిశ్రమగా, పట్టు పరిశ్రమ విరాజిల్లుతోంది.  రైతులతోపాటు, కూలీలకు ఏడాదంతా పనికల్పించి మంచి ఆదాయాన్ని సమకూర్చుతుంది. నీటి వనరులు తక్కువగా ఉన్న కరువు ప్రాంతాల్లో సైతం  చిన్న, సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తుంది. పట్టు పరిశ్రమతో మంచి లాభాలు ఉన్నప్పటికీ.. ప్రచార లోపం కారణంగా రైతుల దరి చేరలేకపోతుంది. దీనివల్ల పట్టుకోసం మన దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టే వారికి  ప్రభుత్వం ఎన్నో రాయితీలతో అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తోంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Work From Home : మంచంపై నుండే ఆఫీసు కార్యకలాపాలతో ఆరోగ్య సమస్యలు

వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ.. శ్రమతో కూడుకున్నా..  రైతులకు మంచి నికరాదాయం అందించే రంగం ఇది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి, రెండెకరాల మల్బరీ తోటతో..  సంవత్సరం పొడవునా పట్టుపురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు.  రిస్కు తక్కువ, నెలనెలా ఆదాయం.. ఉద్యోగస్థులకంటే మెరుగైన జీవనం. ఇవన్నీ పట్టుపరిశ్రమతో సాధ్యం.

READ ALSO : TV news channels : టీవీ న్యూస్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజా సూచన

కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా చేయూతనందిస్తున్నాయి . ముఖ్యంగా రేరింగ్‌ గది నిర్మాణం, రేరింగ్‌ పరికరాల,  క్రిమి సంహారక మందులు,  కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను రాయితీతో ఇస్తున్నారు. పట్టుగూళ్లను మార్కెట్‌కు తరలిస్తే, మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి  కిలోకు అదనంగా ప్రోత్సాహం ఇస్తుంది.

READ ALSO : Lack Of Sleep : నిద్రలేమి బరువు పెంచేలా చేస్తుందా?

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ . ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే… పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో  ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడికోసం వెతుక్కోవాల్సిన పని లేదు.  గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు నిరోధించేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్దరైతు వరకు స్వయంసమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.