High Yielding Rice Variety : డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్.. డి.ఆర్.ఆర్ ధాన్-45, ఇంఫ్రూవుడ్ సాంబమషూరి

తెలంగాణలో హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. ఇవి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. మరికొన్ని రకాలైతే ప్రపంచంలో దాదాపు 40 నుండి 50 దేశాల్లో సాగవుతున్నాయి.

High Yielding Rice Variety : డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్.. డి.ఆర్.ఆర్ ధాన్-45, ఇంఫ్రూవుడ్ సాంబమషూరి

High Yielding Rice Variety

High Yielding Rice Variety : వరి సాగు విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అడుగులు వేస్తోంది. ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే పంటల వైపు రైతులను తీసుకెళ్తోంది. వారి ఆదాయాలు పెంచే క్రమంలో కొత్త వంగడాలను రూపకల్పన చేస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్, భారతీయ వరి పరిశోధన సంస్థ పార్టిఫైడ్ రైస్ వరి వండగాలకు రూపకల్పన చేసింది. ఆ రకాలేంటీ.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : New Variety Of Rice : గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం.. స్వర్ణకు ప్రత్యామ్నాయ రకం ఎంటియు1318

భారత దేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. ఇది దక్షిణ భారతీయులకు ముఖ్యమైన ఆహారం. దేశంలో ఉన్న 50 శాతం పంట భూములలో వరి పండుతుంది. ఇప్పటికీ దేశంలో 70 శాతం జనాభాకు వరి అన్నం తినడం అలవాటు. ఒకప్పుడు భారత్‌ వరి పంటలో..  విదేశాలపై ఆధారపడింది.

READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

కానీ.. ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. ఇవి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. మరికొన్ని రకాలైతే ప్రపంచంలో దాదాపు 40 నుండి 50 దేశాల్లో సాగవుతున్నాయి.

READ ALSO : High Yielding Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న వరి రకాలు.. కె.ఎస్.పి – 6251 , ఎంటియు – 1224

భారత్‌ ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆహార భద్రత సుస్థిరమవుతున్న దశలో ఇకపై పౌష్టికాహార లోపం కూడా ఉండకూడదని, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా శాస్త్రవేత్తలను పలు వరి రకాలను రూపకల్పన చేశారు. మరి ఆ పార్టిఫైడ్‌ రైస్‌ గురించి మరిన్ని విశేషాలను రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్ధానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎల్.వి. సుబ్బారావు ద్వారా తెలుసుకుందాం..