Kashmiri Apple Ber Cultivation: కశ్మీరీ యాపిల్ బేర్ సాగుతో భలే లాభాలు

Kashmiri Apple Ber Cultivation: సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ రైతు కశ్మీరీ యాపిల్ బేర్ సాగుచేసి ఫలితాల్ని రుచి చూస్తున్నారు. లాభాల్ని గడిస్తున్నారు.

Kashmiri Apple Ber Cultivation: కశ్మీరీ యాపిల్ బేర్ సాగుతో భలే లాభాలు

Kashmiri Apple Ber Cultivation: వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు. సాధారణ పద్దతులు, సంప్రదాయ పంటలతో శ్రమ తప్ప లాభం లేదని భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు, ఆదాయం వచ్చే సాగుపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ రైతు కశ్మీరీ యాపిల్ బేర్ సాగుచేసి ఫలితాల్ని రుచి చూస్తున్నారు. లాభాల్ని గడిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అతివేగంగా విస్తరిస్తున్న పండ్లతోటల్లో కశ్మీరీ యాపిల్ బెర్ కూడా ఒకటి నాటిన మొదటి సంవత్సరంలోనే తోటలు ఫలసాయాన్ని అందివ్వటం వల్ల ఈ తోటల సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. అందుకే చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.

ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ కు చెందిన రైతు రాజమౌళి 2 ఎకరాల్లో కశ్మీరీ యాపిల్ బేర్ సాగుచేశారు. ప్రస్తుతం రెండో పంట దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే కశ్మీరీ యాపిల్ బేర్ సాగు ఎంతో మేలంటున్నారు.

Green Malta farming : బత్తాయి సాగులో యాజమాన్య పద్ధతులు !