Groundnut Farming : వేరుశనగలో మొవ్వ కుళ్ళు తెగులు , నివారణ

పూర్తిగా ఎదిగిన మొక్కల్లో తెగులు వచ్చిన వెంటనే ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి పాలిపోయి ఉంటాయి. లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి. ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు.

Groundnut Farming : వేరుశనగలో మొవ్వ కుళ్ళు తెగులు , నివారణ

Groundnut Farming

Groundnut Farming : వేరుశనగ పంటకు తీవ్రంగా నష్టం కలింగించే తెగుళ్లలో మొవ్వకుళ్ళు తెగులు ముఖ్యమైనది. వైరస్ తెగులు,తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. వాతావరణ పరిస్ధితులు , మొక్క ఎదుగుదల పై అధారపడి ఉంటుంది. ఈ తెగులు ఆశించడం వల్ల విత్తిన తర్వాత మొలక రాకుండానే విత్తనం కుళ్ళి పోతుంది. రెండవ దశలో మొలకెత్తిన తర్వాత కాండంపైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది.

పూర్తిగా ఎదిగిన మొక్కల్లో తెగులు వచ్చిన వెంటనే ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి పాలిపోయి ఉంటాయి. లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి. ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు. తెగులు ఆశించిన 15 రోజుల తరువాత మొవ్వు ఎండిపోయి,కుళ్ళిపోతుంది. తెగులు మచ్చలు మొదట నేల మట్టంపై ఉన్న కాండం మీద ఏర్పడి క్రమంగా పై కొమ్మలకు వ్యాపిస్తాయి. కాయలపై కూడ శిలీంధ్రం ఆశించి నల్లని మచ్చల్నిక లుగజేస్తుంది.

తెగులు నివారణకు ;

ఈ తెగులు నివారణకు తెగులును తట్టుకొనే ఆర్-8808, వేమన, ఐ.సి.జి.యస్-11, ఐ.సి.జి.యస్-44 వంటి రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తనశుద్ధి చేసిన తర్వాత 1 గ్రాము టెబుకొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ అనే పొడి మందుతో శుద్ధి చేసి తరువాత విత్తుకోవాలి. విత్తనాన్ని 5 సెం.మీ.ల కంటే లోతుగా వేయకూడదు. శనగ పంటతో పంట మార్పిడి చేయాలి. తెగులు ఆశించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల మాంకోజెబ్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20రోజుల తర్వాత తామర పురుగుల వ్యాప్తి అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లేక డైమిధోయేట్ 2మి.లి.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.