Palm Oil : పామాయిల్ సాగుకు జాతీయ మిషన్

అయిల్ తయారీకి అవసరమైన వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్‌ ఆయిల్‌ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్‌ సాగును

Palm Oil : పామాయిల్ సాగుకు జాతీయ మిషన్

Palm Oil

Palm Oil : వంటనూనెల ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇటీవలికాలంలో గతానికి భిన్నంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం వంట నూనెల ఉత్పత్తిని పెంచటం ద్వారా ధరలను అదుపు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వంటనూనెలపై జాతీయ మిషన్ ఆయిల్ ఫామ్ పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పధకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించటంతో రానున్న ఐదేళ్ళ కాలంలో దేశీయంగానే నూనె గింజల ఉత్పత్తి మరింతగా పెంచేప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టనున్నారు. మిషన్ ఆయిల్ పామ్ పధకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది.

వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో అధికబాగం ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్‌, అమెరికాలలో ఆయిల్‌ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై పన్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు.

అయిల్ తయారీకి అవసరమైన వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్‌ ఆయిల్‌ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్‌ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఫామ్‌ను ప్రకటించింది. ఈశాన్య ప్రాంతం,అండమాన్ నికోబార్ ద్వీపాలపై పామ్ అయిల్ సాగుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నారు.

విదేశాలపై అయిల్ కోసం అధారపడే అవసరాలను భవిష్యత్తులో తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశం ఈ మిషన్ అయిల్ పామ్ ద్వారా కనిపిస్తుంది. పామ్ అయిల్ సాగులో స్వయం సమృద్ధి సాధించటమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోంది. ఎన్ఎమ్ఈఓ ఓపి కింద అయిల్ పామ్ సాగుదారులకు గిట్టుబాటు ధరకు హామీ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం పామాయిల్ సాగుచేసే రైతులకు హెక్టారుకు 12వేల రూపాయలను సబ్సిడీగా చెల్లిస్తుండగా, ఇకపై దానిని 29వేలకు పెంచనున్నారు. 15హెక్టార్లు అయిల్ పామ్ సాగుచేసే రైతులకు కోటి రూపాయల వరకు సాయం అందించనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.