Holidays : మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు.. 7 రోజులు సెలవులు.. పండగ చేస్కొండి
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు ఇది పండగలాంటి వార్తే.. శ్రీరామ నవమి నుంచి ఏప్రిల్ తొలి వారం వరకు బోలేడన్ని సెలవులు రాబోతున్నాయి
holidays from march 27 sri rama navami to april 5 jagjeevan ram birth anniversery detail here
Holidays : సెలవులంటే ముందుగా సంతోషపడేది విద్యార్థులే. ఆ తర్వాత ఉద్యోగస్తులు. అయితే ప్రైవేటు ఉద్యోగులకి ఈ సెలవుల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. ఎందుకంటే వారికి గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ వర్తించవు కాబట్టి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ నడుస్తోంది. మొన్నటి వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే మిగతా తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సెలవులు ఇస్తారు. ప్రస్తుతం ఒంటిపూట బడులే కాబట్టి.. విద్యార్థులు సెలవుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, కొందరు ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఈ హాలిడే లిస్ట్ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నేడు మార్చి 27, శ్రీరామనవమి నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల వ్యవధిలో 7 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఆ వివరాలు..
- మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవాళ సెలవే.
- మార్చి 28: శనివారం సందర్భంగా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వీకెండ్ హాలిడే. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ వారాంతపు సెలవు ఉంటుంది.
- మార్చి 29: ఆదివారం. ఈ రోజు సాధారణ సెలవు.
- మార్చి 31: మంగళవారం మహావీర్ జయంతి. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అంటే మార్చి 31న ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
- ఏప్రిల్ 3: శుక్రవారం గుడ్ ఫ్రైడే. కనుక ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది.
- ఏప్రిల్ 4: శనివారం కొందరికి వీకెండ్ హాలిడే.
- ఏప్రిల్ 5: ఆదివారం. పైగా ఆ రోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది.
మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు మొత్తం పది రోజుల వ్యవధిలో 7 రోజులు సెలవులు రాబోతున్నాయి. శనివారం వీకెండ్ హాలిడే పక్కన పెట్టినా 5 రోజులు మాత్రం తప్పకుండా అందరికీ సెలవులు ఉన్నాయి. కనుక ఉద్యోగులు కుదిరితే ఆ సెలవు లేని రోజుల్లో కూడా లీవ్స్ తీసుకుని.. కుటుంబంతో ప్రశాంతంగా గడపడం, వెకేషన్కు వెళ్లడం వంటివి చేయవచ్చంటున్నారు.
