Panama Disease : అరటి తోటలకు నష్టం కలిగించే పనామా తెగులు!

తెగులు తీవ్రంగా ఉన్న మొక్కలను వేరుచేసి కాల్చివేయాలి. ఒకవేళ పొలంలో ఈ తెగులు తాకిడి తీవ్రంగా ఉంటె కనీసం 3 సంవత్సరాలు అరటిని తిరిగి నాటరాదు. పనామా తెగులుని తట్టుకొనే రకాలను ఎంచుకోవడం ఉత్తమం.

Panama Disease : అరటి తోటలకు నష్టం కలిగించే పనామా తెగులు!

Panama pest that damages banana plantations

Panama Disease : మన దేశంలో విరివిగా పండిస్తున్న పండ్లతోట పంటల్లో అరటి కూడా ఒకటి. అరటిని పండించే దేశాల్లో మన దేశం ముందుండడమే కాకుండా ఇంచుమించు 30 శాతం ప్రపంచ అరటి ఉత్పత్తిని కలిగి ఉంటుంది. అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న తెగుళ్లు. వీటిలో ముఖ్యమైనది పనామా ఫ్యుజేరియం తెగులు . ఈ తెగులును ఫ్యుజేరియం ఆక్సీస్పోరమ్‌ ఫార్మాస్పీసిస్‌ కుబెన్స్‌ అనే నేలలో నివసించే శిలీంధ్రం కలుగజేస్తుంది.

అరటి సాగు చేస్తున్న రైతులను పనామా తెగులు కలవరపెడుతుంది. ఎక్కువగా పనామా తెగులు గురై అరటి దిగుబడి తగ్గిపోతుంది. దీంతో అరటి రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది మట్టి ద్వారా సంక్రమించే శిలీంధ్ర వ్యాధి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. నీటి పారుదల సక్రమంగా లేని నేలల్లో ఎక్కువగా ఈ పనామా తెగులు కనిపిస్తుంది. ఇది సోకినా ప్రారంభ దశలో ఆకుల పసుపు రంగులోకి మారి తరువాత వాడిపోతాయి. వ్యాధి సోకినా మొక్క కాండం ఎర్రటి చారలు కలిపిస్తాయి. ఈ వ్యాధి సోకడానికి అనేక కారణాలు ఉన్నాయి. సంవత్సరాలుగా పంటమార్పిడి చేయకుండా ఒకే పొలంలో అరటి పంటమాత్రమే పండించటం, అధిక ఉష్ణోగ్రత, నీటి పారుదల లేని తేలికపాటి నేలలు, అధిక తేమ శాతం ఈ వ్యాధి పనామా తెగులు వ్యాప్తికి కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పనామా తెగులును కలిగించే ఫ్యుజేరియం శిలీంధ్రంలో నాలుగు రకాల రేస్‌లు ఉన్నాయి. ఇందులో మూడు రకాలు అరటిని ఆశించి నష్టపరుస్తాయి. రేస్‌–1 అనేది అమృతపాణి వంటి అరటి రకాలను ఆశిస్తుంది. రేస్‌–2 కూర అరటిని ఆశిస్తుంది. రేస్‌–3 హెలికోనియా పుష్పాలను ఆశిస్తుంది. రేస్‌–4 గ్రాండ్‌నైన్‌ రకాలతో పాటు పైన వివరించిన అమృతపాణి, కూర రకాలను కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.

తెగులు తీవ్రంగా ఉన్న మొక్కలను వేరుచేసి కాల్చివేయాలి. ఒకవేళ పొలంలో ఈ తెగులు తాకిడి తీవ్రంగా ఉంటె కనీసం 3 సంవత్సరాలు అరటిని తిరిగి నాటరాదు. పనామా తెగులుని తట్టుకొనే రకాలను ఎంచుకోవడం ఉత్తమం. అరటి కొత్త తర్వాత వారిని పండించడం ద్వారా కూడా వీటిని తాకిడిని అదుపులో పెట్టవచ్చు.అరటి మొక్క యొక్క పునాది దగ్గర సున్నం నీటిని చల్లడం ద్వారా వ్యాధి సోకకుండా నివారించవచ్చు. 10 లీటర్ల నీటికి 10గ్రా.ల కార్బెండజిమ్‌ కలిపి అరటి పిలకలకి పిచికారీ చేయాలి.మట్టిలో ట్రైకోడెర్మా వైరైడ్ లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వంటి బయోఏజెంట్‌లను ఉపయోగించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

తెగులు ఉన్న ప్రాంతాల్లో అమృతపాణి రకాన్ని సాగుచేయకూడదు. తెగులు తట్టుకోగలిగిన ఇతర రకాలను ఎంపిక చేసుకోవాలి. తెగులు ఉన్న తోటల్లో ఉపయోగించిన సామాగ్రిని శుభ్రపరుచుకోవాలి. కాళ్లను కూడా నీటితో శుభ్రపరుచుకోవాలి. తెగులు ఉన్న తోటల్లో నీరు పారించకూడదు. డ్రిప్‌ పద్ధతిని పాటించాలి. సాగుకు టిష్యూకల్చర్‌ మొక్కలను ఎంచుకోవాలి.