Sorghum Crop Cultivation : కందిపంటకు నష్టం కలిగించే కాయతొలుచు పురుగులు, నివారణ చర్యలు!

ఈరెక్కల పురుగులు ఈగలాగా చిన్నగా ఉండి పొడవైన కాళ్లుంటాయి. రెక్కలు మెరుస్తూ పారదర్శకంగా ఉంటాయి. ఊరం, ఉదరం నల్లగా మెరుస్తూ ఉంటాయి. పిల్ల పురగులు పాల తెలుపు రంగులో ఉంటాయి.

Sorghum Crop Cultivation : కందిపంటకు నష్టం కలిగించే కాయతొలుచు పురుగులు, నివారణ చర్యలు!

Pests that cause damage to Kandi crop, preventive measures!

Sorghum Crop Cultivation :  వాణిజ్య పంటలైన పత్తి, మిరప వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక విస్తీర్ణంలో కందిపంటను సాగు చేస్తున్నారు. అయితే కంది పంటకు ప్రధానంగా కాయతొలుచు పురుగులు పూత, పిందె దశలో ఆశించి, విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి ఉనికిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవటం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. కందిని ఆశించు కాయతొలుచు పురుగుల ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు, కాయతొలిచే ఈగ.

శనగపచ్చ పురగు; ఈ పురుగులు ముందు జత రెక్కలు మసక గోధుమరంగులో ఉండి, పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బాగా పెరిగిన పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బాగా పెరిగిన పురుగులు ముదురు ఆకుపచ్చ గోధుమ రంగు, ఊదారంగు, నల్లరంగులో ఉంటాయి. ఈ పురుగు పార్శ్వ భాగంలో అలల రూపంలో ఉన్న గాఢ రంగులో చారలు ఉంటాయి. ప్రతి శరీర ఖండితంపైన ఉపరితల భాగంలో రెండు వెంట్రుకలు ఉంటాయి.

ఇవి మొగ్గలు, పువ్వులు, కాయలు లేని దశలో లార్వాలు ఆకులను ఆశించి , విపరీతంగా నష్టం కలిగిస్తాయి. కాయదశలో ఈ పురుగులు కాయలో తలదూర్చి సగభాగం లోపల గూడు పెట్టి పూత కాయలను తింటుంది. తద్వారా కాయలు రాలిపోతాయి.

మారుకా మచ్చల పురుగు ; రెక్కల పురుగు మధ్యస్ధ పరిమాణంలో ఉండి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి. ముందు జత రెక్కలపై తెల్లని మచ్చలు ఉంటాయి. వెనుక జత రెక్కలు తెల్లగా ఉండి అంచులు నల్లగా ఉంటాయి. వీటి లద్దె పురుగులు లేత ఆకు పచ్చ రంగుల్లో ఉండి ప్రతి శరీర ఖండితంపైన ఒక జత నల్లటి మచ్చలుంటాయి. ప్రతి మచ్చపైన ఒక సన్నని వెంట్రుక ఉంటుంది.

ఈ లద్దె పురుగు మొగ్గలను గూడుగా ఏర్పరిచి, వాటిలో ఉండి లోపల భాగాలను తింటాయి. తర్వాత కాయలోకి ప్రవేశించి పెరుగుతున్న గింజలను తింటుంది. కాయకున్న రంధ్రం చిన్నగా ఉండి, పురుగు విసర్జించిన మలంతో కప్పబడి ఉంటుంది.

కాయ తొలిచే ఈగ ; ఈరెక్కల పురుగులు ఈగలాగా చిన్నగా ఉండి పొడవైన కాళ్లుంటాయి. రెక్కలు మెరుస్తూ పారదర్శకంగా ఉంటాయి.  ఉదరం నల్లగా మెరుస్తూ ఉంటాయి. పిల్ల పురగులు పాల తెలుపు రంగులో ఉంటాయి.

లద్దె పురుగులు గుడ్లు నుండి బయటకు రాగానే కాయ పైపొర కింద కొంత తిని , తర్వాత విత్తనంలోకి ప్రవేశిస్తాయి. విత్తనంలో కొంతభాగం మాత్రమే తింటాయి. ఇవి ఆశించిన గింజలు నల్లగా మారి తినడానికి పనికి రావు. ఇవి గింజల్లో పెరుగుతుండటం వల్ల గాయపరచు లక్షణాలను ముందుగా గుర్తించటం కష్టం.

సస్య రక్షణ చర్యలు ; వేసవిలో లోతు దుక్కులు చేపట్టాలి. తద్వార భూమిలో దాగి ఉన్న వివిధ దశల పురుగులను నివారించవచ్చు. పంట మార్పిడి అవలంభించాలి. కాయ తొలిచే పురుగుల తక్కువగా ఆశించే పంటలైన జొన్న , సోయా చిక్కుడు, నువ్వులు, ఉలవలు, వంటి పంటల మార్పిడి చేయాలి. అంతర పంటలు సాగు చేయాలి.

పెసర లేక మినుమును సార్వాలో 7సాళ్లు , రబీలో 3సాళ్లు వేసుకోవాలి. తద్వారా పన్న జీవులను వృద్ధి చేయవచ్చు. కలుపు తగ్గించవచ్చు. రక్షణ పైరుగా జొన్నను పొలం చుట్టూ నాలుగు సాళ్లు విత్తుకోవాలి. పక్షి స్ధావరాలు ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుని, పురుగుల ఉధృతిని తగ్గించాలి.

పైరు విత్తిన 100 రోజులకు చిగుళ్లను ఒక అడుగు మేర కత్తిరించాలి. కాయ తొలచే పురుగులు, గుడ్లు తొలిదశలో ఉంటే వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను చేతితో ఏరివేయాలి. రసానిక పురుగు మందులను సిఫారుసు మేరకు నిర్ధేశించిన మోతాదులో పురుగుల ఉధృతిని బట్టి వాడుకోవాలి.