Mango Cultivation : సరైన యాజమాన్య పద్దతులతో మామిడితోటలలో లాభాల సాగు!

మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవటం అవసరం.

Mango Cultivation : సరైన యాజమాన్య పద్దతులతో మామిడితోటలలో లాభాల సాగు!

Profitable cultivation in mango plantations with proper management practices!

Mango Cultivation : మన మామిడి పండ్లకు అనేక దేశాల్లో మంచి గిరాకీ ఉండటంతో రైతులకు మామిడి సాగు మంచి లాభసాటిగా మారింది. పండ్ల తోటల పెంపకంలో మామిడిది ప్రత్యేక స్ధానంగా చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది రైతులు మామిడి సాగులో నిమగ్నమై ఉన్నారు. సేంద్రీయ విధానంలో మామిడిసాగుతో చాలా మంది రైతులు మార్కెట్లో మంచి ధరలను పొందగలుగుతున్నారు.

మామిడి తోటల సాగుకు ఎర్ర నేలలు, లోతైన నేలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 7.5 నుండి 8 వరకు ఉండేట్లు చూసుకోవాలి. నీటి పారుదలకి అనువుగా ఉండాలి. నల్లరేగడి,చౌడునేలలు, నీరు నిలువ వుండే నేలలు ఈ పంటకు అనుకూలం కాదు. మామిడి మొక్కలు నాటే ముందుగా నేలను మూడు సార్లు బాగా దున్నుకోవాలి. మొక్కలను నాటే ముందు గుంతలలో పశువుల ఎరువును వేసుకోవాలి.

మామిడి సాగుకు అనువైన రకాలు:

మామిడిలో ప్రాంతాన్ని బట్టి పలు రకాలను సాగువైపు రైతులు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం రైతులు బంగినపల్లి,తోతాపురి ,చిన్న రసం,పెద్ద రసం మరియు చెరుకు రసం వంటివి అన్ని ప్రాంతాల వాతవరణ పరిస్థితులకి అనుకూలంగా ఉంటాయి. వీటితోపాటుగా కేసరి, సువర్ణ రేఖ ,దశేరి వంటి రకాలు కూడా ఉన్నాయి. సంకర రకాల విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా ఆమ్రపాలి,రత్న,ఆర్కా పునీత్ మరియు సింధు వంటి రకాలు ఉన్నాయి

నీరు, ఎరువుల యాజమాన్యం ;

మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవటం అవసరం. చెట్లపాదుల్లో ఎండుగడ్డి ఎండిన ఆకులు, మరియు వాడేసిన కొబ్బరిబోండాలు లాంటివి వేసి కప్పి ఉంచాలి దీనివల్ల కలుపు మొక్కల నివారణ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది.

వాతావరణ పరిస్థితులని బట్టి ఎరువులను మొక్కలకు అందించాలి. తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో వర్షా కాలం ప్రారంభంలోనూ ,తర్వాత వర్షా కాలం చివరిలోను వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం ముగిసే సమయంలో ఎరువులు వేసుకోవాలి. తోటల్లో ప్రధానంగా జింక్ లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని నివారణకై లీటరు నీటికి 5 గ్రా, జింక్సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం వచ్చినట్లైతే చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి దీని నివారణకు 2.5 గ్రా, పెర్రస్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

కలుపు సమస్యను నివారించుకునేందుకు పారాక్వాట్ 8 మీ.లీ లేదా అమోనియం సల్ఫేట్ 20 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. మామిడి మొక్కలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్టు కొమ్మల ఆకుల వలన సరైన సూర్యరక్ష్మి చెట్లకి అందక పండ్లని తయారుచేసుకునే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. సిగేచర్,లాఫర్ వంటి పరికరాలను ఉపయోగించాలి.

తెగుళ్ల నివారణ :

తెగుళ్లు మామిడి మొక్కలకి విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి ఇందులో ప్రధానంగా బూడిద తెగులు మరియు మచ్చ తెగులు ఉన్నాయి బూడిద తెగులు ఎక్కువగా వాతావరణం చల్లగా తేమగా ఉన్నప్పుడు వస్తుంది దీని నివారణకై గంధకాన్ని 3గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పూతకి ముందు పూతకి తర్వాత మరియు పిండే దశ లో వున్నప్ప్పుడు పిచికారీ చేసుకోవటం ద్వారా తెగుళ్ల నుండి మామిడి చెట్లను రక్షించుకోవచ్చు.