Kharif Rice Crop : ఖరీఫ్ వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Paddy Cultivation
Kharif Rice Crop : ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి. అయినా రైతులు అధిక విస్తీర్ణంలో వరిసాగును చేపట్టారు. వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి, కంకి పాలుపోసుకునే దశ వరకు ఉంది. అయితే ఎదుగుతున్న తరుణంలో అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
READ ALSO : Norway : పోగోట్టుకున్న చెవిపోగుల కోసం వెతుకుతున్న ఫ్యామిలీకి ఏం దొరికిందో తెలుసా?
తెలుగు రాష్ట్రాలలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఈ ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి కంకి పాలుపోసుకునే దశ వరకు ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
READ ALSO : Male Baldness : పురుషుల్లో త్వరగా బట్టతల రావడం క్యాన్సర్‌కు సంకేతమా?
సన్నరకాలు సాగు చేసిన ప్రాంతాలలో రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షాలు పడడం, మంచు అధికంగా కురవడం వలన బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించిటకు అవకాశం ఉంది. మరోవైపు కంకినల్లి, దోమకాటు ఆశించే అవకాశం ఉన్నందున వీటి నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..